iDreamPost
android-app
ios-app

వీడియో: కన్న కూతుర్ని బైక్ కు కట్టి.. ఈడ్చుకెళ్లిన తండ్రి!

వీడియో: కన్న కూతుర్ని బైక్ కు కట్టి.. ఈడ్చుకెళ్లిన తండ్రి!

ఈ మధ్యకాలంలో కన్నబిడ్డలపై తల్లిదండ్రులే దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రేమ, వివాహేతర సంబంధాల వంటి ఇతర కారణాలతో బిడ్డలపై తల్లిదండ్రులే ఘోరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా తండ్రులు తమ కుమార్తెలను వివిధ కారణాలతో దారుణంగా హత్య చేస్తున్నారు. తాజాగా మరో తండ్రి.. తన కుమార్తెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. యువకుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయిందని కుమార్తెను బైక్ కు కట్టి..ఈడ్చుకుంటూ వెళ్లాడు. దీంతో ఆ యువతి తీవ్రగాయాలతో మృతి చెందింది. ఈ ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పంజాబ్ రాష్ట్రం, అమృతసర్ జిల్లాలోని ముచ్చల్ గ్రామంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం నిందితుడి కుమార్తె.. వేరే యువకుడితో ఇంట్లో నుంచి పారిపోయింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు తీవ్ర అవమానంగా భావించారు. ఈ క్రమంలోనే అయితే మరుసటి రోజు తిరిగి ఆ యువతి ఇంటికి చేరుకుంది. అప్పటికే కుమార్తెపై తండ్రి కోపంతో రగిలిపోతున్నాడు. ఇక కుమార్తె ఇంటికి వచ్చే సరికి.. ఆయన కోపం కట్టలు తెచ్చుకుంది. తన బైక్ వెనుక కుమార్తెను తాడుతో కట్టేసి.. చాలా దూరం లాక్కెళ్లాడు.  అలా కొన్ని కిలోమీటర్ల మేర వేగంతో కుమార్తెను  లాక్కెళ్లి.. సమీపంలోని రైల్వేస్టేషన్ వద్ద వదిలేశాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు యువతి మృతి చెందింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.  ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన సీసీ పుటేజ్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కన్న కూతురి పట్ల ఆ తండ్రి ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. కూతురు తప్పు చేస్తే.. దండించాలి కానీ.. ఇలా దారుణంగా హత్య చేయడం ఏంటని నెటిజన్ల ప్రశ్నిస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:  రైల్వే స్టేషన్ సమీపంలో వివాహిత దారుణ హత్య! కిరాతకంగా..

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio