మూడు నెలల క్రితమే వివాహం.. అంతలోనే భార్యపై దారుణం!

మూడు నెలల క్రితమే వివాహం.. అంతలోనే భార్యపై దారుణం!

ప్రతి ఒక్కరు వివాహ బంధాన్ని ఎంతో గొప్పగా గడపాలని భావిస్తారు. అందుకే తమకు అన్ని రకాల నచ్చిన వారిని వివాహం చేసుకుంటారు. అలానే ఎందరో దంపతులు పిల్లాపాపలతో సంతోషంగా గడపుతున్నారు. అయితే కొందరి జీవితాల్లో మాత్రం పెళ్లి జరిగిన కొన్ని రోజులకే విషాదాలు, దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు.పెళ్లైన మూడున్నర నెలకే  భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు వెళ్తా.. ప్రమాదానికి గురై మరణించాడు. ఈ దారుణ ఘటన అదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన చౌహాన్ లక్ష్మీ, గోపించద్ దంపతుల చిన్న కుమార్తె దీపను, అదిలాబాద్ పట్టణానికి చెందిన అరుణ్ అనే యువకుడితో వివాహం జరిగింది. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వధువు.. కష్టాలు ప్రారంభమయ్యాయి. పెళ్లైన వారం రోజుల నుంచి అరుణ్.. దీపను అనుమానంతో వేధించడం ప్రారంభించాడు. నిత్యం భార్యతో అరుణ్ గొడవ పడుతుండే వాడు. భర్త వేధిస్తున్నాడంటూ దీప.. తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఆమె తండ్రి వచ్చి.. 15 రోజుల క్రితం పుట్టికి తీసుకెళ్లాడు. ఆగష్టు 28న అరుణ్ .. దీప వాళ్ల ఇంటికి వెళ్లే.. ఇక గొడవ పడనని, తనను బాగా చూసుకుంటానని నమ్మించి ఆదిలాబాద్ తీసుకొచ్చాడు.

శుక్రవారం తెల్లవారు జామున అరుణ్ భార్యతో మరోసారి వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే దీపను గొంతు నులిమి, తలను మంచానికి కొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది. అనంతరం అతడు  పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు బైక్ పై బయలు దేరాడు. అయితే అరుణ్ తండ్రి ఫోన్ చేసి.. ఇంటికి రమ్మని చెప్పడంతో.. పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా వెనుతిరిగాడు. తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు పక్కన  ఆగి ఉన్న లారీని  ఢీకొట్టిన అరుణ్ తీవ్రంగా గాయపడి.. అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు  ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అలానే దీప తల్లి ఫిర్యాదుతో మృతుడితో పాటు అతడి  తండ్రి, జైవంత్ రావు, తల్లి పద్మపై  పోలీసులు కేసు నమోదు చేశారు. చూశారా.. కేవలం అనుమానంతో పచ్చని సంసారాన్ని నిట్టనిలువును కాల్చుకున్నాడు. అరుణ్ లాగానే చాలా మంది కుటుంబాల్లో విషాదాలకు కారణం అవుతున్నారు. మరి.. ఇలాంటి వారికి ఎలాంటి శిక్షలు విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments