iDreamPost
android-app
ios-app

ప్రేమించాలని యువకుడి టార్చర్! ఫోన్ కు అసభ్య మెసేజ్ లు పంపి..!

  • Published Sep 01, 2023 | 5:32 PM Updated Updated Sep 01, 2023 | 6:00 PM
  • Published Sep 01, 2023 | 5:32 PMUpdated Sep 01, 2023 | 6:00 PM
ప్రేమించాలని యువకుడి టార్చర్! ఫోన్ కు అసభ్య మెసేజ్ లు పంపి..!

నేటి కాలం యువతి, యువకులు తెలిసి తెలియని వయసులోనే ప్రేమా, గీమా అంటూ సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇక ఇంతటితో సరిపెట్టకుండా కాలేజీ పేరుతో బయటకు వెళ్లి పార్కులు, సినిమాలు అంటూ చెడు తిరుగుళ్లు తిరుగుతున్నారు. ఇక 18 ఏళ్లు కూడా నిండకముందే తల్లిదండ్రులను ఎదురించి మరీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. మరి కొందరు యువకులు మాత్రం.. కంటికి నచ్చిన అమ్మాయి కనిపిస్తే చాలు.., ప్రేమించాలని వెంటపడడం, కాదంటే హత్యలు, అత్యాచారాలకు తెబడుతున్నారు. అచ్చం ఇలాగే వ్యవహరించిన ఓ యువకుడు ఓ యువతిని ప్రేమించాలని వేధించి చివరికి దారుణానికి ఒడిగట్టాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. కొమరంభీం జిల్లా చింతలమానేపల్లి మండలం గంగాపూర్ గ్రామం. ఇదే ఊరిలో దంద్రే సుప్రియ (18) అనే యువతి తల్లిదండ్రులు పాటు నివాసం ఉంటుంది. అయితే ఇదే గ్రామానికి చెందిన ఎల్కరి అంజన్న అనే యువకుడు సుప్రియను గత కొంత కాలంగా ప్రేమించాలని వెంటపడుతున్నాడు. తరుచు ఫోన్ చేస్తూ ప్రేమ పేరుతో టార్చర్ పెడుతున్నాడు. ఇంతే కాకుండా ఆ అమ్మాయికి వాట్సాప్ లో అసభ్యకరమైన సందేశాలు పంపుతూ వేధించడం మొదలు పెట్టాడు. నన్ను ప్రేమించకపోతే మన గురించి వాట్సాప్ గ్రూప్ లో పెడతానని ఆమెపై బెదిరింపులకు దిగేవాడు.

ఇక ఇతగాడి వేధింపులకు తట్టుకోలేని ఈ యువతి ఇటీవల ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా.. కూతురు అపస్మారక స్థితిలో ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, పరిస్థితి విషమించడంతో ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అంజన్నతో పాటు సుప్రియ మృతికి కారణమైన మరో ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్నఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ప్రేమించకపోతే పరువు తీస్తానని వేధించిన అంజన్న దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş