Arjun Suravaram
అమ్మాయిలు తమకు కాబోయే భాగస్వామి గురించి ఎన్నో ఊహించుకుంటారు. కొందరు ప్రేమించిన వ్యక్తిని ఎంతో కష్టనష్టాలు ఓర్చి పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి కొందరి జీవితంలో మాత్రం ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి.
అమ్మాయిలు తమకు కాబోయే భాగస్వామి గురించి ఎన్నో ఊహించుకుంటారు. కొందరు ప్రేమించిన వ్యక్తిని ఎంతో కష్టనష్టాలు ఓర్చి పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి కొందరి జీవితంలో మాత్రం ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి.
Arjun Suravaram
జీవితం అనేది చాలా అందమైనది. అందుకే తమ లైఫ్ ను ప్రతి ఒక్కరు ఎంతో గొప్ప గా ఊహించుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు తమ పెళ్లైన తరువాత వచ్చే కొత్త జీవితం గురించి ఎన్నో కలలు కంటారు. అలానే తమకు కాబోయే భాగస్వామి గురించి ఎన్నో ఊహించుకుంటారు. కొందరు ప్రేమించిన వ్యక్తిని ఎంతో కష్టనష్టాలు ఓర్చి పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి కొందరి జీవితంలో మాత్రం ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా ఓ యువతి పెళ్లైన ఏడాదికే దారుణమైన నిర్ణయం తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా భీమారం మండలం ఆరెపల్లికి చెందిన దుర్గం తిరుపతి, లక్ష్మీ దంపతులు. వీరు స్థానికంగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి చందన(19) అనే కుమార్తె ఉంది. ఆమెను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అదే గ్రామంలో లక్ష్మీ, కనకయ్యా అనే మరో దంపతులు ఉన్నారు. వీరి కి జంపన్న అనే కుమారుడు ఉన్నాడు. జంపన్న, చందన ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం పెద్దల సమక్షంలో ఘనంగా గతేడాది ఆగస్టులో జరిగింది. పెళ్లయిన మూడు నెలల వరకు వీరి సంసారం బాగానే ఉంది. అనంతరం తరచూ చిన్నచిన్న విషయాలకు గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే వరకట్నం విషయం ప్రస్తావిస్తూ చందన భర్త, అత్తమామతో మానసికంగా వేధించేవారు.
వారి వేధింపులకు తట్టుకోలేక చందన దారుణ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 7న గ్రామంలో పోచమ్మ కొలుపు జరుగుతుండగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. ఇక వెంటనే గమనించిన చుట్టుపక్కల వారు.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే చందనాను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించి చికిత్స అందించారు. అయితే చందన చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇలా వరకట్న వేధింపుల కారణంగా, ఆర్థిక సమస్యల కారణంగా ఎంతో మంది యువతులు, వివాహితలు క్షణికావేశంలో దారుణమైన నిర్ణయం తీసుకుంటున్నారు. ఎంతో అభివృద్ధి చెందిన ఈ యుగంలో కూడా ఆడవారు ఇంకా వివిధ రకాల వేధింపులకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.