Arjun Suravaram
సాధారణంగా పోలీసులు అంటే సమాజంలో ఓ రకమైన గౌరవం ఉంటుంది. కారణం.. కుటుంబ సమస్యల నుంచి సమాజంలో జరిగే అనేక నేరాలను అరికట్టంలో ఖాకీలదే కీలక పాత్ర. కానీ, ఓ పోలీసులు కసాయి గా మారి.. భార్యను చితకబాదాడు. ప్రస్తుతం ఆమె..
సాధారణంగా పోలీసులు అంటే సమాజంలో ఓ రకమైన గౌరవం ఉంటుంది. కారణం.. కుటుంబ సమస్యల నుంచి సమాజంలో జరిగే అనేక నేరాలను అరికట్టంలో ఖాకీలదే కీలక పాత్ర. కానీ, ఓ పోలీసులు కసాయి గా మారి.. భార్యను చితకబాదాడు. ప్రస్తుతం ఆమె..
Arjun Suravaram
సాధారణంగా పోలీసులు అంటే సమాజంలో ఓ రకమైన గౌరవం ఉంటుంది. కారణం.. కుటుంబ సమస్యల నుంచి సమాజంలో జరిగే అనేక నేరాలను అరికట్టంలో ఖాకీలదే కీలక పాత్ర. వారు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి..అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. మహిళలు ఆపద అంటూ పోలీసు గడప తొక్కితే వారికి అండగా నిలబడి న్యాయం చేస్తారు. ఇలా ఆపదలో ఉన్న, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేసి.. మంచి పేరు సంపాదిస్తున్నారు. కొందరు పోలీసులు మాత్రం చెడు పనులు చేసి.. ఆ శాఖకు అపకీర్తి తెస్తున్నారు తాజాగా ఓ రక్షక భటుడు.. తన భార్య పాలిట యమభటుడిగా మారాడు. అదనపు కట్నం కోసం వేధిస్తూ చిత్రహింసలకు గురి చేశాడు. సదరు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సీఐ రాజు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన సత్యనారాయణ, లక్ష్మిల మౌనిక అనే కుమార్తె ఉంది. మౌనికను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆమె తల్లిదండ్రులు. వారు కష్టపడుతూ మౌనికను ఉన్నత చదువులు చదివించారు. ఇక ఆమెను అదే గ్రామానికి చెందిన రాజేష్ తో 2021లో వివాహం జరిపించారు. ఇక వివాహం జరిగే సమయంలో కట్నం కింద రూ.20 లక్షల ఇచ్చారు. కానిస్టేబుల్ ఉద్యోగం కావడంతో పెళ్లి సమయంలో తల మించిన భారం అని తెలిసిన రూ.20 లక్షలు ఇచ్చారు. రాజేష్ ఆసిఫాబాద్‌లో సివిల్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
మౌనిక, రాజేశ్ దంపతులకు ఏడాదిన్నర వయసున్న బాబు ఉన్నాడు. కొంతకాలంగా కుటుంబాన్ని రాజేష్ సరిగా పట్టించుకోవడం లేదు. గ్రూప్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో ఆరు నెలల వేతనం రాదని ఇంటికి అద్దె డబ్బులు చెల్లించాలని రాజేశ్ వేధించే వాడటం. అంతేకాక కుమారుడి పుట్టి వెంట్రుకల ప్రోగ్రామ్ కి రూ.2 లక్షలు తీసుకురావాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తూ తరచూ గొడవ పడుతుండే వాడు. ఇదే విషయంలో వారం రోజులుగా వారి ఇంట్లో గొడవ జరుగుతోంది. గురువారం మరోసారి రాజేశ్ ఇంట్లో గొడవ జరగింది.
ఈ క్రమంలోనే భార్యను ఇనుపరాడ్డుతో ఇష్టానుసారంగా చితకబాదాడు రాజేశ్. తీవ్ర గాయాలతో ఆసిఫాబాద్ ఆసుపత్రిలో చేరి మౌనిక చికిత్స పొందుతోంది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తమ బిడ్డను కొంతకాలంగా వేధిస్తున్నట్లు బాధితురాలి తల్లి తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి.. రాజేశ్ పై ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు మౌనిక భర్తతో పాటు అతడి తల్లీదండ్రులు, ఆడపడచు, ఆమె భర్తపై ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపారు. డీఎస్పీ వెంకటరమణ ఆసుపత్రికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. రాజేష్ తో పాటు అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజు పేర్కొన్నారు. మరి.. ఇలా వరకట్నం కోసం మహిళను వేధించే వారికి ఎలాంటి శిక్ష విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.