‘ప్రేమ’ అనేది ఎప్పుడు, ఎవరి మధ్య ,ఎలా పుడుతుందో, ఎవరికి తెలియదు. అలా ప్రేమించుకున్న వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ఉంటుంది. కొందరివి సక్సెస్ లవ్ స్టోరీలు కాగా, మరికొందరివి ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు ఉంటాయి. ఇంకా దారుణం ఏమిటంటే.. కొన్ని లవ్ స్టోరీలు విషాధ కథలుగా మిగిలిపోతున్నాయి. తాజాగా ఓ ప్రేమ జంట మూడు రోజుల వ్యవ్యధిలో ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియురాలికి పెళ్లైందనే బాధతో ప్రియుడు ఆత్మహత్య చేసుకోగా.. నేను నీ దగ్గరే వస్తున్నా అంటూ నవ వధువు కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. స్థానికులు మీడియాకు అందించిన సమాచారం ప్రకారం…
రాజస్థాన్ రాష్ట్రం ఘరోమన్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని షోభాలా జైత్ మాలా గ్రామానికి చెందిన అనిత(22),పుర్ఖారామ్ లు ప్రేమించుకున్నారు. వారిద్దరి మధ్య చాలా ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. వీరిద్దరు కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. చివరకు పెళ్లి చేసుకోవాలని భావించి.. ఇంట్లో వారికి చెప్పగా.. వారు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే అనితకు మరో వ్యక్తితో జూలై 4న వివాహం జరిగింది. ప్రియురాలికి పెళ్లి జరగడంతో పుర్ఖారామ్ తీవ్రంగా కలత చెందాడు. అనిత లేని జీవితం వ్యర్థం అనుకుని జూలై 4న బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న విషయం అనితక జూలై 5 తెలిసింది. కొత్తగా పెళ్లైన అనిత.. తన ఇంటి నుంచి పాలు తీసుకు వచ్చేందుకు పశువుల కొట్టం వద్దకు వెళ్లింది. పాలకు వెళ్లిన అనిత ఎంత సేపటికి ఇంటికి తిరిగి రాలేదు.
కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించగా ఓ బావి దగ్గర పాల పాత్ర కనిపించింది. దీంతో వారు అనుమానంతో బావిలోకి తొంగి చూడగా.. అనిత మృతదేహం తేలుతూ కనిపించింది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీలుసు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అనిత ఆత్మహత్య చేసుకునే ముందు సోషల్ మీడియాలో ప్రియుడి ఫోటోతో పాటు ఓ మెసేజ్ పెట్టింది. ‘మనం జీవించినా, మరణించినా కలిసే ఉంటామని ప్రమాణం చేసుకున్నాం కదా. మరి… నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు. నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేశావు?. అయినా ఫర్వాలేదు.. నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తున్నావు రెండు రోజు లేటయ్యింది సారీ డియర్’ అని రాసింది. ఈ ప్రేమికుల ఆత్మహత్యతో .. వారి గ్రామంలో వారందరినీ శోకసంద్రంలో ముంచింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.