iDreamPost
android-app
ios-app

విషాదం: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు!

విషాదం: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు!

ఈ మధ్యకాలంలో ఆత్మహత్యల వార్తలు బాగా వింటున్నారు. కష్టం ఏదైనా, సమస్య ఏదైనా ఆత్మహత్య పరిష్కారంగా భావిస్తున్నారు. అనారోగ్యం, అప్పులు, పరువు అంటూ అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇంకొందరైతే పోయేవాళ్లు పోకుండా.. కడుపున పుట్టిన పిల్లలను కూడా తమతో పాటే తీసుకెళ్తున్నారు. అలాంటి ఒక విషాద ఘటన గురించే ఇప్పుడు చెప్పుకోబోయేది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది. నీల్ బాద్ ప్రాంతంలో దంపతులు తమ పిల్లలకు విషమిచ్చి.. వాళ్లు ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారి వద్ద ఒక సూసైడ్ నోట్ కూడా దొరికింది. అందులో “మేం ఎంతో సంతోషంగా జీవించే వాళ్లం. మా కుటుంబానికి ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయం కూడా నాకు తెలీదు.  నేను చేసిన తప్పిదం వల్ల నాతో ఉన్న వాళ్లంతా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏప్రిల్ వరకు మేం అంతా ఎంతో సంతోషంగా ఉన్నాం. అప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆన్ లైన్ జాబ్ గురించి ఒక ఆఫర్ వచ్చింది.

తర్వాత టెలిగ్రామ్ లో మరో మెసేజ్ వచ్చింది. కుటుంబ అవసరాల, ఎక్స్ ట్రా సంపాదన కోసం నేను అందుకు ఒప్పుకున్నాను. మొదట్లో కాస్త లాభంగానే అనిపించింది. తర్వాత నేను ఆ కూపంలో ఇరుక్కు పోయాను. ఏ కాస్త సమయం దొరికినా నేను ఆ జాబ్ చేయడం ప్రారంభించాను. నాకసలు సమయమే లేకుండా పోయింది. నేను పెట్టుబడి పెట్టిన డబ్బు ఏమైంది అనే విషయం కూడా నాకు తెలీదు. నేను ఆ డబ్బుని కుటుంబం కోసం కూడా ఖర్చు చేయలేదు. కొన్నిరోజుల తర్వాత నా వర్క్ పూర్తి చేసి నన్ను కమీషన్ తీసుకోమని ఒత్తిడి చేశారు. నా దగ్గర డబ్బు లేదని చెబితే అప్పు తీసుకోమంటూ ఫోర్స్ చేశారు. కానీ, నేను అప్పటికే నిండా మునిగిపోయాను. తర్వాత నేను లోన్ తీసుకున్నాను.

నేను చేసే పని గురించి కనీసం నా భార్యకు కూడా తెలీదు. నా భార్య ఏం చేసినా తప్పు మాత్రం చేయకు అని చెప్పేది. నేను మాత్రం ఏం చేసినా మీ ఆనందం కోసమే చేస్తాను అని చెప్పేవాడిని. నేను పని చేసిన కంపెనీ నాలుగేళ్ల క్రితం మూతపడింది. ఆర్థికంగా నేను ఎంతో నలిగిపోయాను. చివరికి ఈ ఆన్ లైన్ కుంభకోణంలో చిక్కుకున్నాను. కంపెనీ నుంచి నాకు లోన్ ఇచ్చారు. నేను ఆ డబ్బును ముట్టుకోను కూడా లేదు. తిరిగి కంపెనీలోనే పెట్టుబడి పెట్టాను. జూన్ లో నా లోన్ భారం పెరిగిపోయింది. లోనే రికవరీ ఏజెంట్స్ నన్ను బెదిరించడం మొదలు పెట్టారు. ఎలాగోలా జూన్ లో ఈఎంఐ కట్టాను. కానీ, జులై నెలలో రికవరీ ఏజెంట్స్ నా ఫోన్ హ్యాక్ చేసి నా వివరాలు తీసుకుని నా చుట్టాలను, బంధువులను బెదిరించడం ప్రారంభించారు.

అందరూ నా తప్పు వల్ల ఇబ్బందుల్లో పడ్డారు. నేను సైబర్ క్రైమ్ ఆఫీస్ కు వెళ్లాను. అక్కడ అధికారులు లేకపోవడం, సిబ్బంది సెలవుల్లో ఉండటంతో ఫిర్యాదు తీసుకోవడం ఆలస్యం అయింది. నేను లాయర్ ని కలిసి అప్లికేషన్ పెట్టాలి అనుకుంటే.. అతను కాస్త సమం పడుతుంది అన్నాడు. కానీ, నాకు అంత సమయం లేదు. నేను ఎవరితో మాట్లాడలేని, కలవలేని పరిస్థితిలో పడిపోయాను. నేను నా కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెబుతున్నాను. మేము చనిపోయిన తర్వాత పరిస్థితులు సద్దుమణుగుతాయి అనుకుంటున్నా. నేను కోరుకునేది ఒక్కటే.. నేను చనిపోయిన తర్వాత నా కుటుంబసభ్యులను లోన్ కోసం ఇబ్బంది పెట్టకండి. సహోద్యోగులు, చుట్టాలను విసిగించకండి. నా చివరి కోరిక ఏంటంటే.. మాకు పోస్టుమార్టం నిర్వహించకండి. మా అందరికీ ఒకేచోట అంత్యక్రియలు చేయండి” అంటూ సూసైడ్ నోట్ లో ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి