iDreamPost
android-app
ios-app

కనురెప్పలు కత్తిరించి, అరగుండు గీసి.. ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద మృతి!

  • Published Sep 25, 2023 | 9:29 AM Updated Updated Sep 25, 2023 | 10:48 AM
కనురెప్పలు కత్తిరించి, అరగుండు గీసి.. ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద మృతి!

ఇటీవల దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఒంటరిగా ఉన్న ఆడవారిపై కామాంధులు రెచ్చిపోతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ఆడవాళ్లు కనిపిస్తే చాలు మృగాళ్లుగా మారి అత్యాచారాలు, హత్యలకు పాల్పపడుతున్నారు. ప్రతిరోజూ ఇలాంటి కేసులు ఎన్నో నమోదు అవుతున్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా కామాంధుల్లో మార్పు రావడం లేదు. చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే..

చిత్తూరు జిల్లా పెనుమూరులో ఇంటర్ చదువుతున్న భవ్యశ్రీ అనే అమ్మాయి మృతికేసు మిస్టరీగా మారింది. అమ్మాయి మృత దేహం ఉన్న స్థితి చూసి పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. భవ్యశ్రీ కి అరగుండు గీసి, కనురెప్పలు కత్తించి.. బావిలో పడేసి ఉండటం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. వేణుగోపాలపురానికి చెందిన భవ్యశ్రీ ఈ నెల 17వ తేదీ రాత్రి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత వెతికినా అచూకీ లభించలేదు. దీంతో 18వ తేదీన ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు గా నమోదు చేసుకొని పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే 20వ తేదీన గ్రామంలో వినాయక నిమజ్జనం చేస్తుండగా బావిలో భవ్యశ్రీ మృతదేహం అభ్యమైంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Inter girl student death mistery

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. ఇక మృతదేహం అరగుండు గీసి, కనురెప్పలు కత్తిరించి దారుణమైన పరిస్థితిలో కనిపించింది. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు.  ఇదిలా ఉంటే కుటుంబ సభ్యులు తమ కూతురిని దారుణంగా చంపేసి గుర్తుపట్టుకుండా చేసి బావిలో పడేశారని ఆరోపిస్తున్నారు. నింధితులను వెంటనే పట్టుకొని తమకు న్యాయం చేయాలని పెనుమూరు పీఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని.. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఫోరెన్సిక్‌ నిపుణులతో చర్చించామని.. నివేదిక వస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తామని అన్నారు.  ఈ కేసు విచారణలో ఎలాంటి జాప్యం లేదని చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి అన్నారు.