iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి మృతదేహం కలకలం!

  • Published Oct 29, 2023 | 6:05 PM Updated Updated Oct 29, 2023 | 6:05 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ , బీజేపీ మధ్య తగ్గ పోరు నడుస్తుంది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ , బీజేపీ మధ్య తగ్గ పోరు నడుస్తుంది.

  • Published Oct 29, 2023 | 6:05 PMUpdated Oct 29, 2023 | 6:05 PM
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి మృతదేహం కలకలం!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యల్ రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ఇంట్లో ఓ యువకుడి మృతదేహం తీవ్ర కలకం రేపింది. కాగా, మృతుడు ఎమ్మెల్యేకి దూరపు బంధువులు అని అంటున్నారు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

బీహార్ లోని నవాడా జిల్లాకు చెందిన హిసువా అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే నీతూ సింగ్ జిల్లాలోని నర్హత్ గ్రామంలో నివాసం ఉంటుంది. నీతూ సింగ్ కు చెందిన ఇంటిలో ఓ గతిలో పియూష్ సింగ్ అనే యువకుడి మృతదేహం లభ్యం అయ్యింది. అతడు నీతూ సింగ్ కి దూరపు బంధువు. ఈ ఘటన జరిగినపుడు నీతూ సింగ్ అక్కడ లేరని, ప్రస్తుతం ఆమె ఆ గ్రామంలో నివసించడం లేదని అంటున్నారు. నీతూ సింగ్ కొన్నిరోజులగా పాట్నాలో ఉంటున్నారు.

ప్రస్తుతం మృతుడు లభించిన ఇంట్లో నీతూ సింగ్ బావ అయిన సుమన్ సింగ్ కుమారుడు గోలు సింగ్ నివాసం ఉంటున్నట్లు తెలుస్తుంది. అతని గదిలోనే పియూస్ సింగ్ మృత దేహాన్ని పోలీసులు కనుగొన్నారు. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో పియూష్ అక్కడిక వెళ్లాడని, తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా మృతదేహం లభ్యమైంది. గోలు సింగ్ పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. పోస్ట్ మార్టం అనంతరం అసలు విషయాలు వెలుగులోకి వస్తామని అన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibombetcio giriş