iDreamPost
android-app
ios-app

రూ.20వేల కోసం భార్యను అలా! ఇలాంటి భర్తలు కూడా ఉంటారా?

  • Published Mar 15, 2024 | 12:32 PM Updated Updated Mar 15, 2024 | 12:32 PM

Belagavi Crime News: డబ్బు కోసం కట్టుకున్న భార్యను చిత్ర హింసలకు గురి చేస్తూ చంపడమో లేదా ఆత్మహత్యలు చేసుకునే లా ప్రేరేపించడమో జరుగుతుంది. ఇద్దరు పిల్లల తల్లి అనుమానాస్పద స్థితిలో కన్నుమూసింది.

Belagavi Crime News: డబ్బు కోసం కట్టుకున్న భార్యను చిత్ర హింసలకు గురి చేస్తూ చంపడమో లేదా ఆత్మహత్యలు చేసుకునే లా ప్రేరేపించడమో జరుగుతుంది. ఇద్దరు పిల్లల తల్లి అనుమానాస్పద స్థితిలో కన్నుమూసింది.

  • Published Mar 15, 2024 | 12:32 PMUpdated Mar 15, 2024 | 12:32 PM
రూ.20వేల కోసం భార్యను అలా! ఇలాంటి భర్తలు కూడా ఉంటారా?

వివిధ సంప్రదాయల ప్రకారం వివాహబంధంలోకి అడుగు పెట్టిన జంట కొంత కాలానికే అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకుంటున్నారు. చాలా వరకు పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాలు.. ఇలా ఎన్నో కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోతున్నారు. కొంతమంది అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యలను చిత్ర హింసలకు గురి చేస్తూ అన్యాయంగా చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో ఎక్కడో అక్కడ నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇద్దరు పిల్లల తల్లి అనుమానాస్పద స్థితిలో కన్నుమూయడం తీవ్ర కలకం రేపుతుంది. ఈ ఘటన బెల్గాం జిల్లాలో చోటు చేసుకుంది.

బెల్గాం జిల్లా చికోడిలో దారుణం వెలుగు చూసింది. ఇద్దరు పిల్లల తల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం రేపింది. గుండెపోటుతో తన భార్య జువేరియా ముల్లా(28) చనిపోయిందని భర్త చెప్పడం పలు అనుమానాతావు ఇచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని భర్త హత్య చేశాడా? వేధింపుల వల్ల ఆత్మహత్యకు పాల్పపడిందా? అనే కోణంలో విచారణ చేపట్టారు. తల్లిని కోల్పోయిన బిడ్డలు కన్నీరు మున్నీరవుతున్నారు. చికోడీ తాలూకా కరోషి గ్రామానికి చెందిన జువేద్ ముల్లా అన్నారోతో జువేరియా ముల్లాకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్నంగా కొంత డబ్బు, నగలు, వస్తువులు ఇచ్చారు తల్లిదండ్రులు. పెళ్లైన కొంత కాలం భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.

లారీ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్న జువేద్ ముల్లా కొంత కాలంగా తనకు డబ్బు కావాలని, తల్లిదండ్రులకు వద్దకు వెళ్లి డబ్బు తీసుకురమ్మని జువేరియా వేధించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే జువేరియా తన పుట్టింటికి వెళ్లింది. మద్యం సేవించి అత్తాగారింటికి వెళ్లి అక్కడ కూడా డబ్బు తీసుకురావాలని జువేరియా హింసించాడు. డబ్బు లేవు అని చెప్పడంతో భార్యను బలవంతంగా ఇంటికి తీసుకువచ్చడు. పది రోజుల్లోనే జువేరియా శవంగా మారింది.   జువేరియా పుట్టింటికి ఫోన్ చేసిన జువేద్ ముల్లా మీ బిడ్డ గుండెపోటుతో చనిపోయిందని చెప్పాడు. షాక్ కి గురైన జువేరియా కుటుంబ సభ్యులు మృతదేహం వద్దకు వెళ్లి చూడగా మెడ, పొట్ట దగ్గర నల్లగా కమిలిన మచ్చలు కనబడటంతో ఆమెను భర్త, అత్తమామలు కొట్టి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. చిక్కోడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత నిజానిజాలు బయట పడతాయని అన్నారు. మరోవైపు జువేద్ ముల్లా అతని తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు.