iDreamPost
android-app
ios-app

అనకాపల్లిలో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య

  • Published Dec 29, 2023 | 8:43 AM Updated Updated Dec 29, 2023 | 8:43 AM

ఈ మద్య కొంతమంది చిన్న విషయానికే డిప్రేషన్ లోకి వెళ్లి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమస్యలు వస్తే పరిష్కారం కోసం ఆలోచించకుండా.. ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు.

ఈ మద్య కొంతమంది చిన్న విషయానికే డిప్రేషన్ లోకి వెళ్లి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమస్యలు వస్తే పరిష్కారం కోసం ఆలోచించకుండా.. ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు.

అనకాపల్లిలో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య

ఇటీవల చాలా మంది ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురై తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎదుటివారిపై దాడులు చేయడం.. లేదా తమను తామే అంతం చేసుకోవడం చేస్తున్నారు.  పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాలు, ఆరోగ్య సమస్యలు ఇలా ఎన్నో కారణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొని చివరికి చావు ఒక్కటే పరిష్కారం అనుకొని బలవన్మరణానికి పాల్పపడుతున్నారు. వారి కుటుంబాల్లో తీరని దుఖాఃన్ని మిగుల్చుతున్నారు.  ఇటీవల ఆప్పుల బాధలు తట్టుకోలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్న ఆ కుటుంబం సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

అనకాపల్లి పట్టణంలో తీవ్ర విషాదం అందరి హృదయాలు కలచివేసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పపడ్డారు. పట్టణంలో శివరామకృష్ణ స్వర్ణకారుడిగా పనిచేస్తూ ఫైర్ స్టేషన్ వద్ద ప్యారడైజ్ అపార్ట్ మెంట్‌లో జీవిస్తున్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న శివరామకృష్ణ మానసికంగా కృంగిపోతూ వస్తున్నాడు. ఈ విషయం తన భార్య మాధవికి చెప్పడంతో ఆమె ధైర్యం చెబుతూ వచ్చింది. కానీ ఇటీవల అప్పుల వాళ్ల వేధింపులు ఎక్కువ కావడంతో దంపతులు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే భార్య మాధవి, కుమార్తెలు వేద వైష్ణవి, జాహ్నవి, కుసుమల‌తో కలిసి గురువారం రాత్రి సైనెడ్ తాగారు. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే శివరామకృష్ణ, మాధవి, వైష్ణవి, జాహ్నవి కన్నుమూశారు. చిన్న కుమార్తె కుసుమ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్న పోలీసులు ఆర్థిక ఇబ్బందులు కారణంగానే సూసైడ్ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు. శివరామకృష్ణ కుటుంబ సభ్యులు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అందరితో కలిసి చాలా సంతోషంగా ఉండేవారని.. ఇలా ఒకేసారి కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటారని ఎప్పుడూ ఊహించలేదని స్థానికులు, బంధువులు కన్నీరు పెట్టుకున్నారు. ఆర్థిక ఇబ్బందులకు చావు ఒక్కటే పరిష్కారం కాదని అంటున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.