iDreamPost
android-app
ios-app

అడవిలో అమ్మాయితో పట్టుబడ్డ పోలీస్‌.. వెలుగులోకి వీడియో!

అడవిలో అమ్మాయితో పట్టుబడ్డ పోలీస్‌.. వెలుగులోకి వీడియో!

ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌కు చెందిన ఓ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో పోలీస్‌ కానిస్టేబుల్‌ అడవిలో అమ్మాయితో ఉన్నాడు. అమ్మాయితో ఏకాంతంగా ఉన్న అతడు జనాన్ని చూడగానే పరుగులు పెట్టాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తూతుకుడి జిల్లాలోని సుందరేశ్వరపురం గ్రామానికి చెందిన రాజేంద్రన్‌ హైడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతడు తూతుకుడిలోని పోలీస్‌ డిప్యూటి సూరెంటెండెంట్‌ ఆఫీస్‌లో పని చేస్తున్నాడు.

కొద్దిరోజుల క్రితం రాజేంద్రన్‌ ఓ యువతితో అడవిలోకి ఏకాంతంగా గడపడానికి వెళ్లాడు. ఇద్దరూ అడవిలో ఏకాంతంగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతడ్ని చూసిన ఇద్దరూ అక్కడినుంచి పరుగులు పెట్టారు. ఇద్దర్నీ ఆ వ్యక్తి వీడియో తీయటం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి వీడియో తీస్తుండటంతో ఇ‍ద్దరూ మరింత భయపడిపోయారు. ముఖాలకు ముసుగులు వేసుకుని పరుగులు పెట్టారు. చెట్లు,పుట్టల మధ్య పరుగులు తీశారు. ఆ వ్యక్తి వీడియోను తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశాడు.

ఈ వీడియో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు! ఈ సంఘటన పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో అధికారులు విచారణకు ఆదేశించారు. రాజేంద్రన్‌తో పాటు ఆ యువతిని కూడా విచారించారు. విచారణ సందర్భంగా రాజేంద్రన్‌ పలు ఆ సంఘటనపై క్లారిటీ ఇచ్చాడు. అధికారిక విధుల్లో భాగంగానే తాను ఆ అడవిలోకి వెళ్లినట్లు తెలిపాడు. ఆ ప్రాంతంలో జరిగిన సంఘటనకు సంబంధించిన దర్యాప్తుకోసం వెళ్లానని అన్నాడు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.