iDreamPost
android-app
ios-app

భార్య చనిపోయింది అనుకుని అంత్యక్రియలు కూడా చేశాడు! కానీ., 53 రోజుల తరువాత!

ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు జ్యోతి. మే 2 న ఇంట్లో నుండి వెళ్లిపోయింది. భర్త ఆమె కోసం వెతకగా.. ఎక్కడా ఆమె జాడ కానరాలేదు. చివరకు పోలీసులను ఆశ్రయించాడు. అయితే రెండు రోజుల తర్వాత.. అతడి ఇంటికి సమీపంలో ఓ మహిళ మృతదేహం కనిపించింది. కానీ ఆమె తన భార్య కాదని భర్త వాదన.. చివరకు

ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు జ్యోతి. మే 2 న ఇంట్లో నుండి వెళ్లిపోయింది. భర్త ఆమె కోసం వెతకగా.. ఎక్కడా ఆమె జాడ కానరాలేదు. చివరకు పోలీసులను ఆశ్రయించాడు. అయితే రెండు రోజుల తర్వాత.. అతడి ఇంటికి సమీపంలో ఓ మహిళ మృతదేహం కనిపించింది. కానీ ఆమె తన భార్య కాదని భర్త వాదన.. చివరకు

భార్య చనిపోయింది అనుకుని  అంత్యక్రియలు కూడా చేశాడు! కానీ., 53 రోజుల తరువాత!

జ్యోతి ఆకస్మాత్తుగా ఇంటి నుండి వెళ్లిపోయింది. భార్య కోసం భర్త సునీల్ వెతుకగా.. ఆమె జాడ ఎక్కడా కానరాలేదు. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల తర్వాత ఇంటికి సమీపంలోని ఓ పొలంలో ఓ మహిళ మృతదేహం కనిపించింది. అయితే భర్త ఆమె తన భార్య కాదని చెప్పగా.. జ్యోతి తల్లిదండ్రులు మాత్రం ఆ మృతదేహం తన కూతుర్తదేనని చెప్పారు. ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో పాటు బెదిరించడంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకు వచ్చి దహన సంస్కారాలు చేశారు. దశ దిన కర్మ కూడా నిర్వహించారు. ఆమె ఆస్తికలను గంగానదిలో కూడా భర్త నిమజ్జనం చేశాడు. అయితే జ్యోతిది హత్య అని, అల్లుడు చంపేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు.. దీంతో అతడ్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి చావ కొట్టారు పోలీసులు. కానీ ఓ గవర్నమెంట్ ప్లాన్ ఆమె బతికే ఉందని తెలిసేలా చేసింది

ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బింధ్ జిల్లాలో చోటుచేసుకుంది. మెహగావ్‌లో నివాసముంటున్నారు సునీల్, జ్యోతి శర్మ అనే భార్యా భర్తలు. మే 2న ఆమె ఇంట్లో నుండి వెళ్లిపోగా.. సమీపంలో ఓ పొలంలో సగం కాలిన మృతదేహం కనిపించగా.. అది జ్యోతినే అని ఆమె తల్లిదండ్రులు నిర్ధారించి.. అల్లుడితో బలవంతంగా అంత్యక్రియులు నిర్వహించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికీ కూడా జ్యోతి చనిపోలేదంటూ వాదిస్తున్నాడు ఆమె భర్త. తన భార్యను తాను చంపలేదంటూ ఎంత మొత్తుకున్నా పోలీసులు వినిపించుకోలేదు. సునీల్, అతడి కుటుంబంపై పోలీసులు ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. పోలీసుల నుండి తప్పించుకుని తిరుగుతున్నాడు సునీల్. ఓ రోజు బ్యాంకులో డబ్బు తీసుకోవడానికివ వెళ్లగా.. జ్యోతి బ్యాంక్ ఖాతా నుండి రూ. 2700 లావాదేవీలు జరిగినట్లు తెలిసింది. అప్పుడు తెలిసింది ఆమె బతికే ఉందని.

మధ్యప్రదేశ్‌లోని లాడ్లీ బెహనా యోజన కింద ఆమె ఖాతాలో డబ్బులు పడ్డాయి. ఆ డబ్బులు తీయాలంటే కంపల్సరీగా ఫింగర్ ప్రింట్ అవసరం. జ్యోతి ఆ డబ్బులను ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని కియోస్క్ సెంటర్‌లో డబ్బులు విత్ డ్రా చేసినట్లు నిర్ధారించుకుని అక్కడకు వెళ్లారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందించాడు సునీల్. పోలీసులతో నోయిడా చేరుకున్నారు. అక్కడ ఆకస్మాత్తుగా ఓ పుట్ పాత్ పై చెప్పులు సరిచేసుకుంటూ కనిపించింది జ్యోతి. వెంటనే ఆమెను మొహగావ్ తీసుకు వచ్చారు. ఇంట్లో నుండి వెళ్లిపోయిన 53 రోజుల తర్వాత ఆమె ప్రత్యక్షమైంది. అయితే అత్తామమలతో గొడవలు కారణంగా ఆమె వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. జ్యోతిని తిరిగి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆ సగం కాలిపోయిన మృతదేహం ఎవరిదనే ఆలోచనలో పడ్డారు పోలీసులు.