Krishna Kowshik
వాళ్లది మామూలు ప్రేమ కాదూ.. ఆరేళ్ల లవ్ స్టోరీ.. ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉండటంతో మరింత దగ్గరయ్యారు. పెళ్లి ప్రస్తావన రాగానే.. ఉద్యోగం అంటూ దాట వేశాడు.. అయితే..
వాళ్లది మామూలు ప్రేమ కాదూ.. ఆరేళ్ల లవ్ స్టోరీ.. ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉండటంతో మరింత దగ్గరయ్యారు. పెళ్లి ప్రస్తావన రాగానే.. ఉద్యోగం అంటూ దాట వేశాడు.. అయితే..
Krishna Kowshik
యువతీ యువకులు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉంటున్నారు. ఏముంది ఇక చూపులు కలిశాయి.. ఆ తర్వాత మాట మాట కలిసి.. ఇద్దరు మనసుల్ని పంచుకున్నారు. ఎన్నో ప్రేమ ముచ్చట్లు చెప్పుకున్నారు. నువ్వు లేకపోతే నేను లేను, నిన్ను వదిలి నేను ఉండలేను అనే ప్రియుడి మాటలకు మరింత పడిపోయింది ప్రియురాలు. తమ ప్రేమ వ్యవహారాన్ని ఆరేళ్ల పాటు కొనసాగించారు. అయితే పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారి.. మంచి ఉద్యోగం అంటూ దాట వేసే ప్రయత్నం చేశాడు ప్రియుడు. ఇంతలో ఓ కంపెనీలో అతడికి ఉద్యోగం రానే వచ్చింది. ఇక పెళ్లి ఆలస్యం చేయకూడదని పట్టుబట్టింది ప్రియురాలు. అంతే ప్రియుడు అసలు నిజ స్వరూపం బయటకు వచ్చింది.. ఇంతకు ఏం జరిగిందంటే..?
కర్ణాటకలో.. ముత్తురాజ్ అనే వ్యక్తి.. తన పక్కింట్లో ఉండే యువతిని ప్రేమించాడు. ఇతడి కల్లబొల్లి కబుర్లకు యువతి కూడా అతడి ప్రేమ మైకంలో పడిపోయింది. ఇంకే ముందీ సినిమాలు, షికార్లు తిరిగారు. పెళ్లి పేరు తీసుకు వచ్చినప్పుడల్లా.. తనకు మంచి ఉద్యోగం అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అలా ఆరేళ్ల పాటు వీరి లవ్ ట్రాక్ నడిచింది. ఇక అతడికి ఉద్యోగం వచ్చిందని తెలియగానే..తమ పెళ్లి కానుందని ఉబ్బితబ్బుబ్బు అయిపోయింది యువతి. కానీ అంతలోనే బాంబ్ లాంటి వార్త పేల్చాడు ప్రియుడు. తనను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పడంతో.. తాను మోసపోయానని గ్రహించి.. వెక్కి వెక్కి ఏడ్చింది ఆ యువతి. ఇన్నాళ్లు ఇలాంటి మోసగాడినా ప్రేమించింది అనుకుని.. కొన్నాళ్లకు తిరిగి మామాలూ మనిషి అయ్యింది. పెద్దలు తీసుకు వచ్చిన సంబంధం చేసుకుని ఖానాపురలో తన అత్తారింటికి వెళ్లిపోయింది.
అంత సవ్యంగా సాగిపోతున్న ఆమె కాపురంలో.. నిప్పులు పోశాడు ఆమె ప్రియుడు. అనుకోకుండా.. తన భర్తను కలిశాడు ముత్తరాజ్. ఈ క్రమంలో తన భార్యతో గతంలో తాను జరిపిన లవ్ ట్రాక్ అంతా చెప్పేశాడు. అంతే కాకుండా తన వద్ద ఉన్న ఫోటోలన్నీ భర్తకు చూపించాడు. దీంతో ఖంగుతున్న భర్త.. ఇంటికి వెళ్లి..భార్యను ప్రశ్నించాడు. ఆమె సమాధానం కూడా వినకుండా.. భార్యను పుట్టింటికి పంపించేశాడు. ముత్తురాజ్ పంపిన ఫోటోలను తన అత్తమామల ముందు ఉంచాడు. ఆమెను అక్కడే విడిచి పెట్టి వెళ్లిపోయాడు. అయితే మోసం చేయడమే కాకుండా.. పచ్చని సంసారంలో నిప్పులు పోసిన ప్రియుడ్ని ఈ సారి క్షమించలేదు ఆ యువతి. తన తల్లిదండ్రులతో కలిసి.. ముత్తురాజ్ ఇంటి ముందు ధర్నా చేసింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ డిమాండ్ చేసింది. దీంతో అతడు ససేమీరా అనడంతో.. ఈ వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది.