Venkateswarlu
వాళ్లిద్దరూ దాదాపు నాలుగున్నర సంవత్సరాలుగా ప్రేమించుకుంటూ ఉన్నారు. అయితే, ప్రియుడి కారణంగా ఆ ప్రియురాలు ఆస్పత్రి పాలైంది. కొంచెం ఉంటే ఆమె ప్రాణాలు పోయేవి..
వాళ్లిద్దరూ దాదాపు నాలుగున్నర సంవత్సరాలుగా ప్రేమించుకుంటూ ఉన్నారు. అయితే, ప్రియుడి కారణంగా ఆ ప్రియురాలు ఆస్పత్రి పాలైంది. కొంచెం ఉంటే ఆమె ప్రాణాలు పోయేవి..
Venkateswarlu
తాగిన మత్తులో ఓ ప్రియుడు తన ప్రియురాలిపై దారుణానికి ఒడిగట్టాడు. మిత్రులతో కలిసి ఆమెపై దాడికి దిగాడు. కారుతో ఢీకొట్టాడు. కారు ఢీకొట్టడం కారణంగా ఆమె కాలు విరిగింది. ఆస్పత్రి పాలయింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానే సిటీలో చోటుచేసుకుంది. బాధితురాలు ప్రియ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ మేరకు ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘‘ ఉదయం నాలుగు గంటల సమయంలో నా ప్రియుడు అశ్వజిత్ గైక్వాడ్ నాకు ఫోన్ చేశాడు. నేను అతడి దగ్గరకు వెళ్లాను. అతడు తన కుటుంబసభ్యులు, కామన్ ఫ్రెండ్స్‌తో కలిసి ఓ పార్టీలో ఉన్నాడు. నేను అక్కడికి వెళ్లినపుడు అతడి ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపించింది.
ఈ విషయంపై నేను అతడ్ని ప్రశ్నించాను. అతడు నాతో పర్సనల్ మాట్లాడతానని చెప్పాడు. నేను ఫంక్షన్ నుంచి బయటకు వచ్చి అతడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతలో అతడు అతడి స్నేహితులతో బయటకు వచ్చాడు. నేను నా ప్రియుడితో మాట్లాడటానికి ప్రయత్నించాను. కానీ, అతడి స్నేహితుడు రోమిల్ పాటిల్ నన్ను అడ్డుకున్నాడు. అవమానించాడు. ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. రోమిల్ నాపై దాడి చేశాడు. నేను నా ప్రియుడ్ని సపోర్టు అడిగాను. సపోర్టు ఇవ్వలేదు సరికదా..
నేను ఆలోచిస్తూ ఉండగానే వాళ్లు కార్ల దగ్గరకు వెళ్లారు. గొడవ సందర్భంగా నానుంచి వాళ్లు లాక్కున్న ఫోన్, బ్యాగును కూడా వెంట తీసుకెళ్లారు. నేను నా ఫోను, బ్యాగు తీసుకోవటానికి నా బాయ్‌ఫ్రెండ్ కారు దగ్గరకు వెళ్లాను. నా ప్రియుడ్ని అతడి డ్రైవర్‌కు ‘‘ కారుతో లేపేయ్ దాన్ని’’ అని ఆదేశాలు ఇచ్చాడు. డ్రైవర్ కారుతో నన్ను బలంగా ఢీకొట్టాడు. ఓ కారు చక్రం నా కుడి కాలుపైనుంచి వెళ్లింది. నన్ను అలాగే ఈడ్చుకెళ్లారు. ఓ 30 మీటర్ల తర్వాత వదిలేశారు. దాదాపు 30 నిమిషాల పాటు నొప్పితో అల్లాడాను. నాకు సహాయం కోసం ఏడ్చాను.
రోడ్డుపై వెళుతున్న ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. ఆ వ్యక్తి నాకు సహాయం చేయడానికి అక్కడే ఉన్నాడు. కొద్ది సేపటి తర్వాత నా బాయ్‌ఫ్రెండ్ డ్రైవర్ అక్కడికి వచ్చాడు. నేను బతికి ఉన్నానో.. చచ్చానో చెక్ చేశాడు. పోలీసుల దృష్టికి విషయం వెళ్లకుండా ఉండటానికి నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అశ్వజిత్ నేను దాదాపు 4.5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాము. అతడు నన్ను చూడ్డానికి కూడా రాలేదు. అతడి ఫ్రెండ్స్ వస్తున్నారు. పోలీసు కేసును వెనక్కు తీసుకోవాలని బెదిరిస్తున్నారు’’ అని తెలిపింది. అశ్వజిత్ గైక్వాడ్ ఓ ఐఏఎస్ అధికారి కుమారుడిగా తెలియవచ్చింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.