iDreamPost
android-app
ios-app

USలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థి మృతి

యూఎస్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు విద్యార్థి మృతి చెందాడు. అతని మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

యూఎస్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు విద్యార్థి మృతి చెందాడు. అతని మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

USలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థి మృతి

ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే వారి సంఖ్య యేటా పెరుగుతూనే ఉంది. తమ పిల్లలను బాగా చదివించాలని తల్లిదండ్రులు ఫారిన్ కంట్రీస్ కు పంపిస్తున్నారు. యూఎస్ లోనే చదువు పూర్తి చేసి జాబ్ సంపాదించుకుంటే డాలర్లలో సంపాదన.. జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడొచ్చని భావిస్తుంటారు. అలా వెళ్లిన వారు ఏదో ఓ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. బిడ్డలపై గంపెడాశలు పెట్టుకున్న కన్నోల్లకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. యూఎస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు.

అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫినిక్స్ ప్రాంతంలో ఈరోజు హుజురాబాద్ కు చెందిన ముక్క నివేష్ (20) మృతి చెందాడు. ముక్కనివేశ్ గత సంవత్సరం జనవరిలో ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేయడానికి అరిజోనా రాష్త్రం లోని ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ లో చేరాడు. ప్రస్తుతం నివేష్ కంప్యూటర్ సైన్స్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ప్రతి రోజు మాదిరిగానే ఈరోజు కూడా కాలేజీకి వెళ్లేందుకు కారులో బయలుదేరాడు. కళాశాల ముగిసిన అనంతరం అదే కారులో తిరుగు పయనమయ్యాడు.

ఇలా వస్తున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన కారు నవేష్ ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీ కొట్టింది. ఈప్రమాదంలో నివేష్ తో పాటు సహచర విద్యార్థి గౌతమ్ సైతం మృతి చెందినట్లు నివేష్ తల్లిదండ్రులు నవీన్, స్వాతిలు తెలిపారు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించి తమకు అండగా నిలుస్తాడనుకున్న తల్లిదండ్రులకు నివేష్ ఆకస్మిక మరణం తీరని శోకాన్ని మిగిల్చింది.