iDreamPost

టీచర్ హత్య కేసులో కీలక విషయాలు.. అక్కా అంటూనే మర్డర్ చేశాడా..?

కర్ణాటక టీచర్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శనివారం పాఠశాలకు వెళ్లిన టీచర్.. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్. దీంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల తర్వాత..

కర్ణాటక టీచర్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శనివారం పాఠశాలకు వెళ్లిన టీచర్.. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్. దీంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల తర్వాత..

టీచర్ హత్య కేసులో కీలక విషయాలు.. అక్కా అంటూనే మర్డర్ చేశాడా..?

కర్ణాటక టీచర్ దీపికా హత్య కేసులో ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయి. జనవరి 20వ తేదీన పాఠశాలకు వెళ్లిన దీపికా.. మూడు రోజుల తర్వాత శవమై కనిపించిన సంగతి విదితమే. స్కూటర్ ఓ చోట.. ఆమె మృతదేహాన్ని మరోచోట పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసులో మాండ్య జిల్లా మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాష్ట్ర వ్యాప్తంగా దీపికా హత్య కేసు వైరల్ అయ్యింది. కొండ దిగువన మట్టిలో పాతి పెట్టిన మృతదేహం పోలీసులకు లభ్యమైంది. కాగా, ఈ హత్య కేసులో ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు.. ఓ వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె హత్యకు గురైన ప్రాంతంలో.. 13 నిమిషాలతో కూడిన ఓ వీడియో ఫుటేజ్ దీపికా ఫోనులో కనిపించడంతో అతడే హంతకుడని బలంగా నమ్ముతున్నారు పోలీసులు.

దీపికా హత్య కేసులో అసలు ఏం జరిగిందంటే.. మేలుకోటేలోని మాణిక్యహళ్లికి చెందిన వెంకటేశ్ కుమార్తె దీపికాకు లోకేష్ అనే యువకుడితో కొన్నాళ్ల క్రితం పెళ్లైంది. వీరికి 8 ఏళ్ల చిన్నారి ఉంది. కాగా, ఆమె చాలా అందంగా ఉంటుంది. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేస్తూనే.. ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ ఉండేది. ఇప్పుడిప్పుడే ఆమె ట్రెండ్ అవుతుంది. దీపిక ఇన్ స్టా ఖాతాలో ఐదు వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సాధారణంగా దీపిక ఎప్పుడూ బస్సులోనే స్కూల్‌కు వెళుతూ ఉండేది. కానీ జనవరి 20వ తేదీన బస్ మిస్ కావడంతో..తన స్కూటర్‌పై వెళ్లింది. శనివారం మధ్యాహ్నం పని ముగించుకుని 12.30 గంటలకు పని ముగించుకుని బయటకు వచ్చింది. ఆ సమయంలో ఆమెకు ఫోన్ వచ్చింది. కొంత సేపటికి తర్వాత ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది.

సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో.. తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే మేలుకోటేలోని యోగా నరసింహ స్వామి కొండ దిగువన ఓ బైక్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. బండి నంబర్ ఆధారంగా.. తండ్రికి సమాచారం అందించగా.. ఆ బండి తమదేనని, కూతురు కనిపించడం లేదంటూ ఫిర్యాదు ఇచ్చినట్లు చెప్పారు. ఇక బైక్ దొరికిన ప్రాంతం నుండి వెతకగా.. ఓ ప్రాంతం నుండి దుర్వాసన రావడం, గద్దలు ఆ ప్రాంతంలో తిరుగాడటం చూశారు పోలీసులు. అక్కడకు వెళ్లి చూడగా.. మట్టిలో కప్పేసిన దీపిక మృతదేహం కనిపించింది. తల్లిదండ్రులను పిలిపించగా.. తమ కూతురేనంటూ కన్నీరుమున్నీరు అయ్యారు.

అయితే పోలీసులకు అక్కడ ఓ ఫోన్ లభించింది. అందులో తనిఖీ చేయగా.. నితిన్ గౌడ అనే వ్యక్తి నుండి ఫోన్ వచ్చిందని తేలింది. కాగా, భర్త చెప్పిన వివరాల ప్రకారం.. నితిన్ తమకు తెలుసునని.. అతడు తనను అన్న అని, దీపికాను అక్క అని పిలిచేవాడని చెబుతున్నారు. అయితే ఆ ఫోనులో నితిన్‌తో గొడవ పడుతున్న ఓ వీడియో బయటకు వచ్చింది. అయితే ఇందులో నితిన్ ఒక్కడే ఉన్నాడా.. లేక ఇంకొంత మంది ఉన్నారా అనే విషయంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆమె హత్య చేసి.. గోతిలో పూడ్చిపెట్టారని నిర్ధారణకు వచ్చారు. ఆ రోజు నుండి నితిన్ ఆచూకీ లభించడం లేదని చెబుతున్నారు పోలీసులు. నితిన్ తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించగా.. చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయ్ అని, తన కోసం వెతకకు అని చెప్పినట్లు తెలుస్తోంది. అతడే తన భార్య దీపికను హత్య చేశాడని భర్త ఆరోపిస్తున్నారు. అక్కా అంటూ ఆమెను హత్య  చేశాడని అంటున్నారు. అతడిని పట్టుకుని జీవిత ఖైదు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Lokesh Gowda (@deepika.v_gowda)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి