iDreamPost
android-app
ios-app

పెళ్లై పది రోజులే.. ఏం జరిగిందో తెలియదు.. ఇంతలోనే దారుణం!

  • Published Jul 13, 2023 | 10:02 AM Updated Updated Jul 13, 2023 | 10:02 AM
  • Published Jul 13, 2023 | 10:02 AMUpdated Jul 13, 2023 | 10:02 AM
పెళ్లై పది రోజులే.. ఏం జరిగిందో తెలియదు.. ఇంతలోనే దారుణం!

పెళ్లి గురించి కలలు కనని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వివాహం, కాబోయే భాగస్వామి గురించి ఎన్నో ఆశలు, కలలు, కోరికలతో పాటు భయాలు కూడా ఉంటాయి. కొత్త బంధం, భాగస్వామితో జీవితం ఎలా ఉంటుందో అన్న చిన్నపాటి టెన్షన్‌ ఉంటుంది. ఇక మన జీవితంలోకి వచ్చిన వ్యక్తి… మనల్ని అర్థం చేసుకుంటే.. ఆ బంధం నిండు నూరేళ్లు సంతోషంగా సాగిపోతుంది. లేదంటే మధ్యలో ముగుస్తుంది. కానీ కొందరు మరో అడుగు ముందుకు వేసి చాలా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు. తమ మనసులో ఏం ఉందో కనీసం కన్నవారితో కూడా చెప్పరు. ఎవరికి ఏం చెప్పకుండా తమ మనసులోనే బాధ పడుతూ.. చివరకు దారుణం నిర్ణయాలు తీసుకుని.. కన్నవారికి జీవితాంతం తీరని కడుపుకోత మిగుల్చుతారు.

తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డకు.. మంచి సంబంధం చూసి.. ఎంతో ఘనంగా వివాహం చేశారు ఆ తల్లిదండ్రులు. బిడ్డ నూరేళ్ల జీవితం గురించి కలలుకంటున్న తల్లిదండ్రలుకు ఊహించని షాక్‌ తగిలింది. పెళ్లైన పది రోజులకే కుమార్తె చేసిన పనితో.. ఆ ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంతకు ఏం జరిగింది అంటే..

పెళ్లైన పది రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న దారుణ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పళ్లిపట్టు యూనియన్‌ రామసముద్రం పంచాయతీ వీజీఆర్‌ కండ్రిగ దళితవాడకు చెందిన రవి అనే వ్యక్తి కొడుకు ముత్తు జేసీడీ డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ముత్తుకు.. అతడి గ్రామానికే చెందిన సమీప బంధువు రాజేంద్రన్‌ కుమార్తె అనుతో వివాహం నిశ్చయమయ్యింది. జూన్‌ 29న.. ముత్తు ఇంట్లో వీరి వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి నూతన దంపతులు సంతోషంగానే ఉన్నారు.మరి ఏం జరిగిందో తెలియదు కానీ.. వివాహమైన 10 రోజుల వ్యవధిలోనే నవ వధువు అను ఆత్మహత్య చేసుకుంది.

మంగళవారం రాత్రి భర్త నిద్రపోయిన తర్వాత అదే గదిలో అను ఉరి వేసుకుని.. ఆత్మహత్య చేసుకుందింది. తెల్లవారుజామున మెలకువ వచ్చి.. లేచిన ముత్తుకు భార్య అను ఆత్మహత్య చేసుకుని కనిపించడం చూసి షాకయ్యాడు. వెంటనే ఈ విషయం తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. దారుణం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం.. అను మృతదేహాన్ని తిరుత్తణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అను మృతికి గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లై నిండు నూరేళ్ల భర్తతో కలిసి సంతోషంగా జీవించాల్సిన కుమార్తె.. ఇలా వివాహమైన పది రోజులకే ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడాన్ని ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom