iDreamPost
android-app
ios-app

పెళ్లికాని కుర్రాడితో “ప్రేమ”లో పడ్డ ఇద్దరు పిల్లల తల్లి! భర్త అడ్డుగా ఉన్నాడని..!

పెళ్లికాని కుర్రాడితో “ప్రేమ”లో పడ్డ ఇద్దరు పిల్లల తల్లి! భర్త అడ్డుగా ఉన్నాడని..!

పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు ప్రేమ. ఈమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అలా వీరి సంసారం చాలా కాలం పాటు సంతోషంగానే సాగుతూ వచ్చింది. కానీ, రాను రాను ఈ మహిళ వక్రబుద్దిని చూపించింది. తన పేరులో ఉన్న ప్రేమనే భర్తపై కాకుండా పెళ్లికాని కుర్రాడిపై ఒలకబోసింది. ఇక ఇంకేముంది.. టైమ్ దొరికినప్పుడల్లా ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండేది. ఇక కొంత కాలానికి ఆమెకు భర్తతో ఉండడం కంటే ప్రియుడితోనే ఉండాలని భావించింది. ఇందుకోసం ఆమె వేసిన స్కెచ్ విజయవంతంగా పూర్తి చేసి అనుకున్నది సాధించింది. సినిమా లెవల్ లో ఉన్న ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు నమక్కల్ జిల్లా చెల్లిపాలేం గ్రామంలో పేరియ సామి (37)-ప్రేమ (35) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారుల సంతానం. దంపతులు ఇద్దరు స్థానికంగా పని చేస్తూ సంసారాన్ని కొనసాగించేవారు. ఇదిలా ఉంటే.. ప్రేమ స్థానిక బేకరీలో పని చేసే నందకేశవన్ (28) అనే పెళ్లికాని కుర్రాడితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారిపోయింది. దీంతో అప్పటి నుంచి ప్రేమ భర్తకు తెలియకుండా సీక్రెట్ గా ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ వచ్చింది. ఇక టైమ్ దొరికినప్పుడల్లా ప్రియుడు నందకేశవన్ ను కలుస్తూ చేయాల్సినవన్నీ చేసేది. దీనికి ఆమె ప్రియుడు కూడా సహకరించడంతో భారీగానే ఎంజాయ్ చేసేది. ఈ క్రమంలోనే ప్రేమకు భర్తతో ఉండడం కంటే ప్రియుడితోనే ఉండాలని భావించింది.

కానీ, మొగుడు అడ్డుగా ఉన్నాడు. ఏం చేయాలో ఆ మహిళకు అస్సలు అర్థం కాలేదు. అప్పుడు ప్రేమకు ఓ ఐడియా తట్టింది. అదే.. తన భర్త పెరియసామిని ప్రాణాలతో లేకుండా చేయడం. అనుకున్నదే ఆలస్యం.. ప్రేమ ఇదే విషయాన్ని తన ప్రియుడు నందకేశవన్ కు వివరించింది. అతడు కూడా సరేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక భర్త హత్యలో భాగంగా.. నాకు చెవిలో నొప్పిగా ఉందని, మోహనూరు ఆస్పత్రికి వెళ్దామని ప్రేమ భర్తను నమ్మించింది. తన స్కెచ్ ప్రకారం ఈ నెల ఆగస్టు 23న భర్తను తీసుకుని ఆ మహిళ మోహనూరు ఆస్పత్రికి బయలు దేరింది. ఇక మార్గమధ్యలో అప్పటికే కాపు కాచి ఉన్న ప్రేమ ప్రియుడు వీరి రాక కోసం ఎదురు చూశాడు. వాళ్లు రాగానే ఆ మహిళ సినిమా స్టైల్ షాకిచ్చి ప్రియుడితో కలిసి భర్త పేరియసామిని హత్య చేసింది.

ఆ తర్వాత నా భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడని మొసలి కన్నీరు కారుస్తూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, ప్రేమ ప్రవర్తనపై అనుమానం రావడంతో మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రేమను విచారించగా మొదట్లో తనకేం సంబంధం లేదన్నట్లుగా డ్రామా ఆడింది. అయితే విచారణలో ఆమె నందకేశవన్ అనే యువకుడితో తరుచు ఫోన్ లో మాట్లాడేదని పోలీసులు గుర్తించారు. మొత్తానికి పోలీసుల స్టైల్ లో విచారించే సరికి ప్రేమ అసలు నిజాన్ని బయటపెట్టింది. నా ప్రియుడితో ఉండేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని, అందుకే నందకేశవన్ తో కలిసి భర్త పేరియసామిని హత్య చేశానని చేసిన తప్పును అంగీకరించింది. అనంతరం పోలీసులు నిందితులైన ప్రేమ, ఆమె ప్రియుడు నందకేశన్ ను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ప్రియుడితో ఉండేందుకు అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసిన ఈ దుర్మార్గురాలి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేచండి.

ఇది కూడా చదవండి: వీడియో: నిద్రపోతున్న భర్తపై వేడి నీళ్ళు పోసిన భార్య! ఎందుకుంటే?

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş