iDreamPost
android-app
ios-app

అత్తపై మనసు పడ్డాడు! గ్రామ పెద్దల తీర్పుతో సీన్ రివర్స్!

  • Published Jul 05, 2023 | 6:19 PM Updated Updated Jul 05, 2023 | 6:25 PM
  • Published Jul 05, 2023 | 6:19 PMUpdated Jul 05, 2023 | 6:25 PM
అత్తపై మనసు పడ్డాడు! గ్రామ పెద్దల తీర్పుతో సీన్ రివర్స్!

ప్రవీణ్ కుమార్, శ్రీను ఇద్దరు మంచి స్నేహితులు. చాలా కాలం నుంచి మిత్రులుగా కలిసి తిరుగుతున్నారు. అయితే, ప్రవీణ్ కుమార్ గ్రామంలోనే అతని అత్తమామలు నివాసం ఉంటున్నారు. ప్రవీణ్ కుమార్ తో కలిసి శ్రీను అప్పుడప్పుడు అతని అత్తింటికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే ప్రవీణ్ కుమార్ అత్తపై మనసుపడ్డాడు శ్రీను. ప్రవీణ్ కు తెలియకుండ శ్రీను అతని అత్తతో సీక్రెట్ గా అన్నీ చేసేస్తున్నాడు. దీనికి ఆ మహిళ కూడా సహకరించింది. కట్ చేస్తే.. ఇదే విషయం గ్రామస్తులతో పాటు శ్రీను స్నేహితుడు ప్రవీణ్ కుమార్ కు కూడా తెలిసింది. ఇదే విషయంపై గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టించి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

తమిళనాడులోని నమక్కల్ జిల్లా వెలగౌండంపట్టి అక్కలంపి గ్రామం. ఇక్కడే ప్రవీణ్ కుమార్, శ్రీను అనే యవకులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ మంచి స్నేహితులు. ఇదిలా ఉంటే.., ఇదే ప్రాంతంలో ప్రవీణ్ కుమార్ అత్తమామలు కూడా నివాసం ఉంటున్నారు. అయితే, శ్రీను అప్పుడప్పుడు ప్రవీణ్ కుమార్ అత్త ఇంటికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే శ్రీను తన స్నేహితుడితో అత్తను పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం రాను రాను వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారిపోయింది.

శ్రీను కొన్నాళ్ల నుంచి ఆ మహిళతో చీకటి కాపురాన్ని నడిపిస్తూ వచ్చాడు. ఇదే విషయం ప్రవీణ్ కుమార్ మామకు తెలిసింది. దీంతో అతడు తన భార్యతో పాటు శ్రీనును కూడా హెచ్చరించాడు. ఇదే కాకుండా వీరిద్దరినీ పెద్దల ముందుకు పిలిచి పంచాయితీ పెట్టించారు. ఇక నుంచి శ్రీను ఆ మహిళతో కలవడం, మాట్లాడడం కానీ చేయకూడదంటూ తీర్పు ఇచ్చారు. దీనికి శ్రీనుతో పాటు ఆ మహిళ కూడా సరేనంది. ఇక అత్తతో వివాహేతర సంబంధం ప్రవీణ్ కుమార్ కూడా తెలిసింది.

తన అత్తమామల పరువు తీసిన శ్రీనును చంపాలని అనుకున్నాడు ప్రవీణ్ కుమార్. ఇక అనుకున్నట్లుగానే.. సోమవారం శ్రీను పడుకున్నది చూసి ప్రవీణ్ కుమార్ అతనిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో శ్రీను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం ప్రవీణ్ కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని ఎట్టకేలకు నిందితుడు ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet