iDreamPost
android-app
ios-app

భర్తకు తలకొరివి పెట్టిన భార్య.. కంటతడి పెట్టిస్తున్న విషాద ఘటన!

  • Published Jul 18, 2023 | 6:14 PM Updated Updated Jul 18, 2023 | 6:29 PM
  • Published Jul 18, 2023 | 6:14 PMUpdated Jul 18, 2023 | 6:29 PM
భర్తకు తలకొరివి పెట్టిన భార్య.. కంటతడి పెట్టిస్తున్న విషాద ఘటన!

శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ భర్త ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, అంత్యక్రియల్లో భాగంగా తలకొరివి పెట్టేందుకు ఆమెకు కుమారులు లేకపోవడంతో చివరికి భార్యే భర్తకు తలకొరివి పెట్టింది. ఈ సీన్ చూసి గ్రామస్తులు, బంధువులు కన్నీటి సంద్రంలో మనిగిపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్స్ ఒక్కొరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా హిర మండలం మేజర్ పరిధిలోని చిన్నకోరాడ గ్రామం. ఇక్కడే నగరపు శంకరరావు (40)-రోహిణి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. కొంత కాలానికి వీరికి ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. కాగా ఈ దంపతులు ఇద్దరు గ్రామంలో కూలీనాలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అలా వీరి కాపురం సంతోషంగా సాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల నుంచి భర్త శంకరరావు కడుపు నొప్పితో బాధ పడుతూ ఉన్నాడు. అయితే, ఇటీవల ఆ నొప్పి మరింత తీవ్ర తరమైంది. దీంతో ఆ సమయంలో శంకరరావుకి ఏం చేయాలో తెలియక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అతని భార్య రోహిణి వెంటనే అప్రమత్తమై జిల్లా ఆస్పత్రికి తరలించింది. ఇక ఫలితం లేకపోవడంతో శంకరరావు చికిత్స పొందుతూ ఇటీవల ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం భార్య రోహిణి భర్త మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లింది. ఆ తర్వాత గ్రామస్తులు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ, సమయానికి శంకరరావు కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. దీనికి తోడు ఈ దంపలుకు ఇద్దరూ ఆడ పిల్లలే. ఇక తలకొరివి పెట్టేందుకు ఎవరూ లేకపోవడంతో భార్య రోహిణి భర్తకు తొలకొరివి పెట్టింది. ఈ సీన్ చూసి గ్రామస్తులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చయేస్తున్నారు.

ఇది కూడా చదవండి: దారుణం: మైనర్ బాలికపై ప్రియుడి ముందే సామూహిక అత్యాచారం!

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş