iDreamPost
android-app
ios-app

నేరాలు, ఘోరాలు అంటే మహా పిచ్చి! చంపితే ఎలా ఉంటుందో చూడాలనుకుని..!

ఆమెకు నేరాలు, ఘెరాలు అంతే ఎంతో ఇష్టం. అందుకు కోసం తరుచు క్రైమ్ నవలలు, పుస్తకాలు చదువుతూ ఉండేది. మనిషిని చంపితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే దారుణానికి పాల్పడింది.

ఆమెకు నేరాలు, ఘెరాలు అంతే ఎంతో ఇష్టం. అందుకు కోసం తరుచు క్రైమ్ నవలలు, పుస్తకాలు చదువుతూ ఉండేది. మనిషిని చంపితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే దారుణానికి పాల్పడింది.

నేరాలు, ఘోరాలు అంటే మహా పిచ్చి! చంపితే ఎలా ఉంటుందో చూడాలనుకుని..!

ఆమెకు నేరాలు, ఘెరాలు అంతే ఎంతో ఇష్టం. అందుకు కోసం తరుచు క్రైమ్ నవలలు, పుస్తకాలు చదువుతూ ఉండేది. ఇంతే కాకుండా అప్పుడప్పుడు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు కూడా ఎక్కువగా చూసేది. అలా ఆమెకు క్రైమ్ పట్ల ఇష్టం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే నిజంగా ఓ మనిషిని చంపితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆశ పెరిగిపోయింది. దీంతో ఎలాగైన ఎవరినైన హత్య చేయాలని భావించింది. కానీ, అది ఎలా అనేది ఆమెకు అర్థం కాలేదు. ఇందు కోసం గూగుల్ లో సెర్చ్ చేసి అన్ని విషయాలు తెలుసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ మహిళ ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఆమె కోరిక తీర్చుకునేందుకు ఏం చేసింది? ఈ క్రైమ్ స్టోరీలో అసలు ఏం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. దక్షిణ కొరియాలోని ఓ ప్రాంతంలో జుంగ్ యూ జుంగ్ (23) అనే యువతి నివాసం ఉండేది. ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉండేది. ఈ సమయంలో ఆమె క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, క్రైమ్ నవలలు వంటివి చూస్తూ కాలక్షేపం చేస్తుండేది. అలా ఆమెకు క్రైమ్ అంటే బాగా ఇష్టం పెరిగిపోయింది. నేరాలు, ఘోరాలు అంటే మహా పిచ్చి అనేలా తయారైంది. ఇక ఎలాగైన సరే లైవ్ లో ఓ మనిషిని చంపుతుంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకుంది. ఇందు కోసం అసలు మనిషిని ఎలా హత్య చేయాలి? శవాన్ని ఎలా మాయం చేసి తప్పించుకుని తిరగాలి అనే విషయాల గురించి గూగుల్ లో బాగా సెర్చ్ చేసింది. ఇక ఎవరిని హత్య చేయాలని అనుకున్న తరుణంలోనే ఈ దుర్మార్గురాలికి ఓ ఐడియా వచ్చింది.

అదేంటంటే? హోమ్ ట్యూషన్ పేరుతో ఈ మహిళ ఏకంగా 50 మందిని సంప్రదించింది. ఎట్టకేలకు ఓ 26 ఏళ్ల మహిళను ఎంచుకుంది. నా బిడ్డకు ఇంట్లో ట్యూషన్ చెప్పాలని ఆమెను నమ్మించింది. దీనికి ఆ మహిళ కూడా సరేనంటూ అంగీకరించింది. ఈ క్రమంలోన ఓ రోజు ట్యూషన్ టీచర్ ఆమె ఇంటికి రాగానే తన ప్లాన్ ను అమలు పరిచింది. ఆ ట్యూషన్ టీచర్ ఇంట్లో అడుగు పెట్టగానే జుంగ్ యూ జుంగ్ కత్తితో 100 సార్లు పొడిచి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది. అనంతరం వాటిని పోగు చేసి ఓ సూట్ కేస్ లో కుక్కింది. ఓ ట్యాక్సీ డ్రైవర్ కు ఇంటికి పిలిచి కారులో ఆ సూట్ కేసును తీసుకెళ్లి ఓ నదిలో పడేసి చేతులు దులుపుకుంది.

అయితే, ఆ సూట్ కేస్ అంతా రక్తం మరకలతో నిండిపోవడంతో ట్యాక్సీ డ్రైవర్ కు కాస్త అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు రంగంలోకి దిగి జుంగ్ యూ జుంగ్ ని విచారించగా అసలు నిజాలు బయపెట్టింది. దీంతో పోలీసులు ఆమెను కోర్టుకు తరలించడంతో ఇటీవల న్యాయస్థానం ఆమెకు యావజ్జీవన ఖైదు విధించింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. మనిషిని చంపితే ఎలా ఉంటుందో చూడాలనుని ఏకంగా ఓ మహిళను చంపిన ఈ దుర్మార్గురాలి కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet