iDreamPost
android-app
ios-app

షణ్ముఖ్‌ని పట్టించిన అన్నయ్య పాపం! ఇలాంటి మనుషులా వీళ్ళు?

  • Published Feb 22, 2024 | 12:22 PM Updated Updated Feb 22, 2024 | 2:57 PM

‘అరే ఏంట్రా ఇది’ అనే డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు సోషల్ మీడియా స్టార్, యూట్యూబర్, బిగ్ బాస్5 రన్నర్ షణ్ముఖ్ జస్వంత్. అతడ్ని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి తీసుకుంటుండగా ఆయన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

‘అరే ఏంట్రా ఇది’ అనే డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు సోషల్ మీడియా స్టార్, యూట్యూబర్, బిగ్ బాస్5 రన్నర్ షణ్ముఖ్ జస్వంత్. అతడ్ని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి తీసుకుంటుండగా ఆయన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

  • Published Feb 22, 2024 | 12:22 PMUpdated Feb 22, 2024 | 2:57 PM
షణ్ముఖ్‌ని పట్టించిన అన్నయ్య పాపం! ఇలాంటి మనుషులా వీళ్ళు?

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం మొదలైంది. ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ గంజాయి సేవిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు దొరికిపోయాడు. సోషల్ మీడియా వేదికైన యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మింస్, వెబ్ సిరీస్ చేస్తూ పాపులర్ అయ్యాడు ఈ వైజాగ్ కుర్రాడు. వైవా, వరల్డ్ ఫేమస్ హాస్టెండ్, వరల్డ్ ఫేమస్ వైఫ్స్, ఫోటో షూట్, టీమ్ మేనేజర్, కర్మ వంటి షార్ట్ ఫిలిమ్స్‌తో పేరు తెచ్చుకున్నాడు. కానీ అతడ్ని ఓవర్ నైట్ స్టార్ చేసింది మాత్రం.. సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్. ఇందులో బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్. ప్రతి లవ్ ఫెయిల్యూర్ అబ్బాయి ఈ సిరీస్‌తో కనెక్ట్ అయిపోయారు. తన అమాయకపు నటనతో అందర్ని ఆకట్టుకున్నాడు షన్ను. ఆ తర్వాత వచ్చిన సూర్య వెబ్ సిరీస్ అతడ్ని అందరికీ దగ్గర చేసింది.

ఆ తర్వాత బిగ్ బాస్5లో అడుగుపెట్టి రన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చాక ఓటీటీ మూవీ, స్టూడెంట్ అనే వెబ్ సిరీస్ చేశాడు షణ్ముఖ్. మొన్నటి మొన్న ప్రముఖ హాస్య నటుడు వైవా హర్ష కీలక పాత్రలో నటిస్తున్న సుందరం మాస్టారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చి సందడి చేసిన షన్ను.. ఇప్పుడు గంజాయి కేసులో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులకు ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ..దొరికిపోవడం ఇక్కడ గమనార్హం. అయితే ఇలా జరగడానికి అతడి అన్నయ్య పాపమే.. శాపమైంది. తమ్ముడు చేసిన తప్పు వల్ల అన్న పట్టుబడాల్సి వచ్చింది. ఓ అమ్మాయిని మోసం చేసి పాపం ఊరికే పోలేదు..అన్నయ్యతో సహా షణ్ముఖ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఇంతకు ఏమైందంటే..

షణ్ముఖ్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్.. డాక్టర్ మోనిక అనే యువతిని మోసం చేశాడు. తనతో ప్రేమ పెళ్లి అని కబుర్లు చెప్పి.. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి అనగా.. మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఆరు రోజుల్లో మోనికతో పెళ్లి పెట్టుకుని.. మరో అమ్మాయిని మనువాడటంతో సంపత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఈ విషయంపై అడిగేందుకు సంపత్ ఫ్లాట్‌కు వెళ్లగా.. అక్కడ గంజాయి తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టుబడ్డాడు షణ్ముఖ్ జస్వంత్. ఊహించని ఈ చర్యకు షన్ను, అతడి సోదరుడు షాక్ అయ్యారు. అనంతరం ఇద్దర్ని అదుపులోకి తీసుకుని.. వేర్వేరు కేసులు నమోదు చేశారు పోలీసులు. కాగా, షన్ను గతంలో కూడా హిట్ అండ్ రన్ కేసులో అరెస్టైన సంగతి విదితమే. ప్రస్తుతం వీరి అరెస్టుతో ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగంపై మరోసారి చర్చకు దారి తీసినట్లయ్యింది.  చూసేందుకు చాలా అమాయకంగా  కనిపించే షన్ను ఇలాంటి వాడా అంటే నిజంగా నమ్మలేకపోతున్నారు ఇతడి ఫ్యాన్స్.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio