iDreamPost
android-app
ios-app

Shahana: షహానా కేసులో కొత్త ట్విస్ట్‌.. సంచలన విషయాలు చెప్పిన చెల్లెలు!

కేరళలో షహానా కేసు కలకం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి.. తాజాగా షహానా చెల్లెలు మీడియాతో మాట్లాడింది. సంచలన విషయాలను బయట పెట్టింది.

కేరళలో షహానా కేసు కలకం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి.. తాజాగా షహానా చెల్లెలు మీడియాతో మాట్లాడింది. సంచలన విషయాలను బయట పెట్టింది.

Shahana: షహానా కేసులో కొత్త ట్విస్ట్‌.. సంచలన విషయాలు చెప్పిన చెల్లెలు!

షహానా కేసు ప్రస్తుతం కేరళ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 23 ఏళ్ల షహానా షాజి అనుకోని విధంగా ఆత్మహత్య చేసుకోవటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా, షహానాకు చెల్లెలు వరసయ్యే ఓ యువతి మీడియాతో మాట్లాడింది. పలు సంచలన ఆరోపణలు చేసింది. అత్త ఒత్తిడి కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపింది. అత్త మానసికంగా,శారీరకంగా తన సోదరిని ఒణికించిందని అన్నారు. ఆమె మాట్లాడుతూ… ‘‘ అత్త ఆమెను మానసికంగా తరచుగా హింసిస్తూ ఉండేది.

చాలా సార్లు కొట్టింది కూడా. ఓ రోజు షహానా భర్తకు ఆపరేషన్‌ జరగాల్సి ఉండింది. అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడు అక్కడ అత్తకు ఆమెకు మధ్య గొడవ జరిగింది. అది కూడా హాస్పిటల్‌ డాక్యుమెంట్ల మీద ఎవరు సంతకం పెట్టాలన్నదానిపై. అత్త.. షహానాను అందరి ముందు కొట్టింది. కొరికింది కూడా. ఆమెను ఎవరు ఎన్ని తిట్టినా.. ఎవరు ఏం చేసినా.. ఆమె భర్త సైలెంట్‌గా ఉండేవాడు. కరోనా సమయంలో ఇద్దరి పెళ్లి జరిగింది. మొదట్లో కట్నం వద్దని అన్నారు. తర్వాత పెద్ద మొత్తంలో కట్నం తీసుకున్నారు.

new twist in shahana case

మొదట్లో ఆమెను బాగానే చూసుకున్నారు. షహానా మరదికి పెళ్లి అయిన తర్వాత అంతా మారిపోయింది. ఆమెను వేరుగా చూసేవారు. అత్త దారుణంగా తిట్టేది.. ‘ నువ్వు పేద కుటుంబంనుంచి వచ్చావు.. చెత్త కుప్పనుంచి వచ్చావు’ అంటూ వేధించేది. షహానాను ఇంట్లోంచి వెళ్లగొట్టి వేరే పెళ్లి చేయాలని చూసేది’’ అని తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. షహానా షాజికి కట్టక్కాడ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో మూడేళ్ల క్రితం పెళ్లయింది. ఈ దంపతులకు ఒకటిన్నర సంవత్సరాల పాప ఉంది. అత్త వేధింపులు భరించలేకపోయింది. ఈ విషయం భర్తకు చెప్పినా అతడు పెద్దగా పట్టించుకోలేదు.

దీంతో మూడు నెలల క్రితం భర్తతో గొడవల కారణంగా పాపతో పుట్టింటికి వచ్చేసింది. మంగళవారం భర్త ఆమె దగ్గరకు వచ్చాడు. తన మేనల్లుడి పుట్టిన రోజు వేడుకలకు తీసుకెళ్లటానికి ప్రయత్నించాడు. అయితే, తనకు పిలుపు రాలేదు కాబట్టి తాను రానని ఆమె తెగేసి చెప్పింది. దీంతో భర్త కూతుర్ని తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయాడు. భర్త ప్రవర్తన కారణంగా కలత చెందిన ఆమె ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. తన గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని చనిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఉరికి వేలాడుతున్న షహానాను గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş