iDreamPost
android-app
ios-app

వెలుగులోకి కోల్‌కత్తా RG కర్‌ మెడికల్‌ కాలేజీ చీకటి కోణాలు! ప్రిన్సిపల్‌ ఒక మాఫియా కింగ్‌?

  • Published Aug 19, 2024 | 4:22 PM Updated Updated Aug 19, 2024 | 4:22 PM

Kolkata, RG Kar Medical College, Sandip Ghosh: దేశాన్ని కుదిపేస్తున్న ‘కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార’ ఘటన కేసు విచారణలో.. ఆ మెడికల్‌ కాలేజ్‌ మాజీ పిన్సిపల్‌పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Kolkata, RG Kar Medical College, Sandip Ghosh: దేశాన్ని కుదిపేస్తున్న ‘కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార’ ఘటన కేసు విచారణలో.. ఆ మెడికల్‌ కాలేజ్‌ మాజీ పిన్సిపల్‌పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 19, 2024 | 4:22 PMUpdated Aug 19, 2024 | 4:22 PM
వెలుగులోకి కోల్‌కత్తా RG కర్‌ మెడికల్‌ కాలేజీ చీకటి కోణాలు! ప్రిన్సిపల్‌ ఒక మాఫియా కింగ్‌?

కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో ఈ నెల 8న నైట్‌ డ్యూటీలో ఉండి.. అదే రోజు రాత్రి సెమినార్‌ హాల్‌లో కాస్త విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిన ఆమెపై అత్యాచారం జరిగింది. ఆ తర్వాత అత్యంత దారుణంగా ఆమెను హతమార్చారు. శరీరం అంతా గాయాలు.. ప్రైవేట్‌ పార్ట్స్‌, పెదాలు, కళ్లు.. ఇలా అన్ని సున్నితమైన భాగాలను అతి కిరాతంగా చిదిమేశారు. 9వ తేదీ ఉదయం సెమినార్‌ హాల్‌లో అర్ధనగ్నంగా.. శవమై కనిపించిన ఆ డాక్టర్‌ను చూస్తూ.. అక్కడున్న వాళ్లు కళ్ల నుంచి నీళ్లు ఆగలేదు. ఆ దారుణం చూసి.. దేశంలో మరో నిర్భయ లాంటి ఘటన జరిగిందని, బాధితురాలికి న్యాయం కావాలి, నిందితులకు కఠిన శిక్ష పడాలంటూ.. దేశవ్యాప్తంగా వైద్యులు, సామాన్యులు రోడ్డెక్కారు. ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న అంశం.. ‘కోల్‌కత్తా వైద్యురాలి హత్యాచారం’.

ఆరంభంలో ఈ కేసును దర్యాప్తు చేసిన కోల్‌కత్తా పోలీసులు.. సివిక్‌ వాలంటీర్‌ సంజయ్‌ రాయ్‌ని నిందితుడిగా అరెస్ట్‌ చేశారు. కానీ, ఇది ఒక్కడు చేసిన పనిలా లేదని, గ్యాంగ్‌ రేప్‌లా ఉందని.. తల్లిదండ్రులు, బాధితురాలి సన్నిహితులు ఆరోపించడంతో.. కేసును సీబీఐకి బదిలి చేశారు. సీబీఐ రంగంలోకి దిగిన తర్వాత.. ఈ కేసులో భయంకరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఘటన జరిగిన తర్వాత.. ప్రిన్సిపల్‌ పోస్ట్‌కు రాజీనామా చేసిన డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌ గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ అడ్డాగా అతను చేస్తున్న దారుణాలపై ఓ జాతీయ మీడియా సంస్థ కూడా పలు కథనాలు ప్రచురించింది. ఆయన కోలీగ్స్‌, ఆర్‌జీ కాలేజీ మాజీ స్టాఫ్‌, మాజీ ప్రిన్సిపల్‌ క్లాస్‌మెట్స్‌ను సంప్రదించి.. పలు విషయాలను సేకరించింది. వారు వెల్లడించిన విషయాలను బట్టి.. పిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ చీకటి కోణాలు తెలిసి అంతా షాక్‌ అవుతున్నారు.

ఉచ్చు బిగిస్తున్న CBI

కోల్‌కత్తా డాక్టర్‌ రేప్‌ అండ్‌ మర్డర్‌ కేసును సీబీఐ టేక్‌ ఓవర్‌ చేసిన తర్వాత.. ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌ను వరుసగా మూడో రోజు విచారించింది. ఆదివారం ఏకధాటిగా 13 గంటలను పాటు డాక్టర్‌ సందీప్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది సీబీఐ. వైద్యురాలి హత్యాచార ఘటన తర్వాత.. ‘రాత్రుళ్లు క్యాంపస్‌లో ఒంటరిగా ఎవరు తిరగమన్నారు’ అంటూ సందీప్‌ చాలా నిర్లక్ష్యంగా ఆ ఘటనపై స్పందించారు. అలాగే వైద్యురాలి మృతదేశాన్ని చూసేందుకు.. దాదాపు మూడు గంటల పాటు ఆమె తల్లిదండ్రులను ప్రిన్సిపల్‌ అనుమతించలేదు. ఘటన వెలుగు చూసిన తర్వాత.. ఆస్పత్రికి చేరుకున్న బాధితురాలి తల్లిదండ్రులను మృతదేహాన్ని చూపుకుండా.. మూడు గంటల పాటు ఎందుకు అడ్డుకున్నారంటూ.. సీబీఐ డాక్టర్‌ సందీప్‌ను ప్రశ్నించింది. అలాగే.. మృతదేహం ఉన్న సెమినార్‌ హాల్‌లో ఎవరి అనుమతితో రెన్నోవేషన్‌ పనులు చేపట్టారంటూ ప్రశ్నించింది.

మాఫియాను నడిపిన ప్రిన్సిపల్‌..?

ఆర్‌జీ మెడికల్‌ కాలేజ్‌లో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సందీప్‌ ఎంత చెబితే అంత. ఆయన అనుమతి లేనిదే అక్కడ ఏం జరగదు. ఈ ఘటన తర్వాత.. ఆయనపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఆస్పత్రిలో జరిగే ప్రతి అభివృద్ధి పనిలో కమీషన్‌ తీసుకునేవాడు. అలాగే మెడికల్‌ కాలేజీ విద్యార్థులను ఉద్దేశపూర్వకంగా ఫెయిల్‌ చేయడం వారి నుంచి డబ్బు గుంచి.. పాస్‌ చేయడం లాంటి దారుణాలకు పాల్పడేవాడు. అలాగే ఆస్పత్రిలో గుర్తుతెలియని మృతదేహాలను మాయం చేసి.. వాటిని ఎవరికో అమ్ముకునేవాడంటూ కూడా డాక్టర్‌ సందీప్‌పై ఆరోపణలు ఉన్నాయి. కాలేజీ హాస్టల్‌లో లిక్కర్‌ విక్రయాలను కూడా ప్రొత్సహించేవాడని, డ్రగ్స్‌, మనీ ల్యాండరింగ్‌ వంటి వాటితో కూడా అతనికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Kolkata RG kar medical college priciple

ఒక ప్రతిష్టాత్మక మెడికల్‌ కాలేజీకి ప్రిన్సిపల్‌గా ఉన్న అతను.. ఎంతో పవర్‌ ఫుల్‌ వ్యక్తి. డబ్బు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని.. తన అక్రమాలను కొనసాగించేవాడని పలువురు వైద్య నిపుణులు కూడా ఆరోపించారు. ఇప్పుడు ఈ ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటన తర్వాత అతను.. ప్రిన్సిపల్‌ పోస్టుకు రాజీనామా చేసినా.. కేవలం 8 గంటల వ్యవధిలోనే అతనికి నేషనల్‌ మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు అప్పగించారని సమాచారం. పైగా ఇంటర్వ్యూలో 16వ ర్యాంకు వచ్చినా.. అతనికి గతంలో ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజ్‌ పిన్సిపల్‌గా నియమించినట్లు.. ఆయనతో పాటు చదివిన వ్యక్తులు ఆరోపించారు. మరి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ట్రైనీ డాక్టర్‌ హత్య కేసులో కూడా.. ఏమైనా కుట్ర కోణం ఉందా? అనేది తేల్చేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. కాలేజీలో జరుగుతున్న దారుణాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన.. ట్రైనీ డాక్టర్‌ను.. పథకం ప్రకారం అతి క్రూరంగా అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి.. దీన్ని ఒక రేప్‌ అండ్‌ మర్డర్‌ కేసుగా చిత్రీకరించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు కూడా సీబీఐ అనుమానిస్తూ.. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేపడుతోంది. మరి ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌పై వస్తున్న ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.