Keerthi
నిత్యం ప్రయాణీకుల రద్దీతో కలకలాడుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వరుస చోరీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ చోరీలకు పాల్పడుతున్న నిందుతుడిని పోలీసుల చేతికి చిక్కాడు. దీంతో ఆ నిందుతుడి వద్ద సూమారు అన్నీ లక్షల విలువగల వస్తువులు లభ్యమవ్వడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.
నిత్యం ప్రయాణీకుల రద్దీతో కలకలాడుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వరుస చోరీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ చోరీలకు పాల్పడుతున్న నిందుతుడిని పోలీసుల చేతికి చిక్కాడు. దీంతో ఆ నిందుతుడి వద్ద సూమారు అన్నీ లక్షల విలువగల వస్తువులు లభ్యమవ్వడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.
Keerthi
సాధారణంగా రైల్వే స్టేషన్లు అంటే ప్రయాణికుల రద్దీతో కలకలాడుతు కనిపిస్తుంది. అందులోని సికింద్రాబాద రైల్వే స్టేషన్ అంటే.. ప్రయాణీకుల రద్దీ మాములుగా ఉండదు. నిత్యం ఎంతోమంది జనంతో కిక్కిరిసిపోయినట్లు ఈ స్టేషన్ ఒక జాతరలా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ప్రయాణీకుల రద్దీతో పాటు దొంగల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏమాత్రం అప్రమాత్తంగా ఉన్న అంతే సంగతులు. క్షణాల్లో చోరీలకు పాల్పడుతుంటారు. కాగా, వీరు సాధారణ మనుషుల మధ్య తిరుగుతూ.. రైలు కోసం వేచి చూసే ప్రయాణికులను, అందులో ప్రయాణించే వారినే లక్ష్యంగా తీసుకుంటూ వారి వద్ద విలువైన వస్తువులను దోచుకుపోతారు. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వరుస ల్యాప్ టాప్ ల చోరిలకు పాల్పడుతున్న ఓ దొంగను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, నిందుతుడి దగ్గర దొరికిన వస్తువులు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
నిత్యం ప్రయాణీకులతో రద్దీగా ఉండే సికింద్రాబాద రైల్వే స్టేషన్ లో తరుచుగా నగదు, బంగారం, ల్యాప్ టాప్ వంటివి చోరీలకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో అయితే చాలామంది ప్రయాణికులు తమ విలువైన ల్యాప్ టాప్ లను ఈ రైలు ప్రయాణంలో పొగొట్టుకుంటున్నారు. అయితే ఇలా ప్రయాణికుల నుంచి వరుస చోరీలకు పాల్పడుతూ తప్పించుకొని తిరిగుతున్న దొంగను తాజాగా రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆ నిందుతుడి వద్ద దొరికిన ల్యాప్ టాప్స్ ను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. ఆ నిందుతుడి వద్ద రూ.7 లక్షల విలువైన 10 ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లుతో పాటు ఓ ద్విచక్ర వాహనం కూడా లభ్యమైయ్యాయి. దీంతో వెంటనే పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
అలాగే రైల్వే స్టేషన్ లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఈ నిందితుడును.. కర్ణాటకు చెందిన శ్రీశైల భోసాగిగా గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా, ఇటీవల కాలంలో వరుస ల్యాప్‌టాప్‌లు పోతున్నాయంటూ సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు ఈ దొంగతనాలకు పాల్పడుతున్న నిందుతుడి పై ప్రత్యేక నిఘా పెట్టి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అలాగే ఈ చోరీలకు పాల్పడిన నిందుతుడు సాధారణ ప్రయాణీకుడిగా రైలులో ప్రయాణిస్తూ.. ప్రయాణీకుల ల్యాప్‌టాప్‌లను చోరీ చేస్తున్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. కనుక ఇక నుంచి రైలులో ప్రయాణించే ప్రయాణికులు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా చోరికి గురైతే వెంటనే సమీపంలోని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు పేర్కొన్నారు. మరి, రైల్వే స్టేషన్ లో అన్నీ లక్షల విలువగల ల్యాప్ టాప్ లను చోరీ చేసిన నిందుతుడిని రైల్వే పోలీసులు గుర్తించి అరెస్ట్ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.