టీచర్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు. హంతకుడు అతడేనా..?

కర్ణాటకలో హత్యకు గురైన స్కూల్ టీచర్ ఘటన ప్రస్తుతం స్థానికంగానే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను సంచలనంగా మారింది. శనివారం నుండి కనిపించకుండా పోయిన దీపిక.. మూడు రోజుల తర్వాత శవమై కనిపించింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కర్ణాటకలో హత్యకు గురైన స్కూల్ టీచర్ ఘటన ప్రస్తుతం స్థానికంగానే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను సంచలనంగా మారింది. శనివారం నుండి కనిపించకుండా పోయిన దీపిక.. మూడు రోజుల తర్వాత శవమై కనిపించింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కర్ణాటకలో సంచలనం సృష్టిస్తోంది టీచర్ దీపికా హత్య కేసు. మాండ్య జిల్లా నివాసి అయిన దీపిక.. ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. శనివారం యథావిధిగా పాఠశాలకు స్కూటీపై బయలు దేరి వెళ్లింది ఆ మహిళ..మధ్యాహ్నమే బయటకు వచ్చినా.. రాత్రైనా ఇంటికి తిరిగి చేరలేదు. అయితే ఓ ప్రాంతంలో కొన్ని గంటల పాటు బండి నిలిపి ఉండటం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆ వెహికల్‌ను సీజ్ చేసి.. దాని నంబర్ ఆధారంగా ఆమె తల్లిదండ్రులను కాంటాక్ట్ చేస్తే.. అప్పుడు తెలిసింది ఆమె కనిపించడం లేదని. వెంటనే ఆమె కోసం వెతుకులాట సాగించగా..అక్కడే హత్య కాబడి.. మట్టిలో పూడ్చిన ఆమె మృతదేహం లభించింది.

వివరాల్లోకి వెళితే.. పాండవవూర్ తాలూకాలోని మాణిక్యహళ్లి గ్రామానికి చెందిన దీపిక జనవరి 20 వ తేదీన కనిపించకుండా పోయి.. మూడు రోజుల తర్వాత శవమై కనిపించింది. వెంకటేష్ కుమార్తె అయిన దీపికకు లోకేష్ అనే యువకుడితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ పాప. దీపిక ఎస్ఈటీ పబ్లిక్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుంది. ఆమె చాలా అందంగా ఉండేది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ మంచి ఫేమ్ తెచ్చుకుంది. తన భర్తతో రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉండేది. శనివారం మధ్యాహ్నం స్కూల్‌కు వెళ్లిన ఆమె.. మధ్యాహ్నమే అక్కడి నుండి బయలు దేరింది. కానీ ఇంటికి చేరుకోలేదు. కంగారు పడ్డ తండ్రి ఆ రోజు సాయంత్రమే మేలుకోటే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే అక్కడ సమీపంలోని యోగా నరసింహ స్వామి కొండ దిగువన దీపిక స్కూటర్ ఉండటం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు అక్కడకు చేరుకుని బండి నంబర్ ఆధారంగా దీపిక తండ్రి ఫోన్ చేయడంతో ఆమె కనిపించడం లేదన్న విషయం తెలిసింది. అదే సమయంలో కొండ దిగువన దుర్వాసన రావడంతో పాటు ఆకాశంలో డేగలు కూడా తిరుగుతుండటంతో.. పోలీసులు ఆ దిశగా వెళ్లగా.. దీపిక మట్టిలో కప్పేయబడి కనిపించింది. సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు. కూతురు కనిపించకుండా పోయిన మూడు రోజుల తర్వాత ఆమె శవంపై కనిపించడంతో భర్త.. పోలీసులపై మండిపడ్డాడు. భర్త లోకేశ్ తెలిపిన వివరాల ప్రకారం..

 

‘శనివారం ఉదయం 9 గంటలకు తన బండితో ఇంటి నుంచి బయలుదేరిన నా భార్య.. మధ్యాహ్నం 12.06 గంటలకు పాఠశాల నుంచి బయటకు వచ్చింది. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. మేము ఆమె కోసం అప్పటి నుండి వెతికాం. సాయంత్రం వరకు వెతికినా కనిపించకపోయే సరికి సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాం. కొండ సమీపంలో ఆమె వాహనాన్ని పోలీసులు కనుగొన్నారు. కానీ ఆమె ఆచూకీ కానరాలేదు. సాయంత్రం 6 గంటలకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినా, సోదాలుచేయలేదు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే నా భార్య చనిపోయింది’ అని ఆరోపణలు చేశారు.

కాగా, సంఘటనా స్థలంలో లభించిన దీపికా మొబైల్ ఆధారంగా.. ఆమెకు చివరి కాల్ నితీష్ అనే వ్యక్తి నుండి వచ్చింది. నితీష్ కూడా అదే గ్రామానికి చెందిన వాడని పోలీసులు చెబుతున్నారు. వీరిద్దరి మధ్య పరిచయం ఉందని అన్నారు. నితీష్ తో దీపిక మధ్య గొడవ జరిగిందని, దానికి సంబంధించిన 13 సెకన్ల వీడియో తమకు లభించిందని పేర్కొన్నారు. ఇతడే ఆ హత్య చేశాడని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నితీష్ పరారీలో ఉన్నాడని చెబుతున్నారు. కాగా, భర్త లోకేష్ చెబుతున్న దాని ప్రకారం.. నితీష్ ఆమెను అక్క అని పిలిచేవాడని అంటున్నారు. అతడు వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. కాగా, నితీష్ ఆచూకీ లభించకపోవడంతో.. అతడి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Show comments