iDreamPost
android-app
ios-app

కూలిపోయిన వ్యాయామశాల పైకప్పు.. 11 మంది దుర్మరణం!

కూలిపోయిన వ్యాయామశాల పైకప్పు.. 11 మంది దుర్మరణం!

ప్రమాదాలు అనేవి ఎప్పడు, ఎలా, ఏ రూపంలో వస్తాయో ఎవ్వరికి తెలియదు.  అయితే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం నిర్లక్ష్యం. దీనికి కారణంగా ఎందరో అమాయకులు బలవుతుంటారు. ఎవరో నిర్లక్ష్యంగా ఉండి తప్పు చేస్తే.. మరెవరో దానికి బలవుతున్నారు. ఆదివారం బంగ్లాదేశ్ లో ఓ డ్రైవర్ నిర్లక్ష్యానికి 17 మంది జలసమాధి అయ్యారు. తాజాగా చైనాలో ఓ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 11 మంది మృతి చెందడంతో ఆ ప్రాంతమంతా రోదనలతో మిన్నంటింది.

చైనాలోని హెయిలాంగ్జియాంగ్ ప్రావిన్స్ లోని ఓ పాఠశాల జిమ్ లో ఆదివారం వాలీబాల్ ప్రాక్టీస్ జరుగుతుంది. సరిగ్గా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో  ఆ జిమ్ పైకప్పు కుప్పకూలిపోయింది. దీంతో 10 మంది మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.. సమాచారం అందుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద ఉన్న పలువురుని బయటకు లాగారు.  గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. భారీ వర్షం కురుస్తోన్న కారణంగా శిథిలాలను తొలగించే ప్రక్రియ నిదానంగా సాగుతోంది.  ఈ ఘటనకు సంబంధించి ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. వ్యాయామశాలకు ఆనుకొని నిర్మిస్తున్న మరో భవన నిర్మాణ పనులే దుర్ఘటనకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు అధికారులు వెల్లడించారు.

అలానే జిమ్ పైకప్పు భాగంలో వ్యర్ధమైన వస్తువులను ఎక్కువగా నిల్వ ఉంచడంతో, ఆ బరువుకు కప్పు పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.  ఇటీవలే వాలీబాల్ గేమ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్లి వచ్చి.. తాజాగా ఇక్కడ ప్రాక్టిస్ చేస్తున్నారు. మొత్తం 19  మంది ఉండగా వారిలో నలుగురు ప్రమాదం నుంచి తప్పించుకున్నారని స్థానికులు మీడియాతో తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కొందరి నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాతో తెలిపారు. మరి.. ఈ ఘటన కారుకులైన వారికి ఎలాంటి శిక్ష విధించాలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండిమద్యం తాగి కారు నడిపిన మహిళా మంత్రి.. ఆపై పదవికి రాజీనామా!