iDreamPost

మద్యం తాగి కారు నడిపిన మహిళా మంత్రి.. ఆపై పదవికి రాజీనామా!

మద్యం తాగి కారు నడిపిన మహిళా మంత్రి.. ఆపై పదవికి రాజీనామా!

ప్రజాప్రతినిధులు అంటే ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తుంటారు. అలానే చట్ట సభల్లో పరిపాలనకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో పాల్గొంటారు. ఇలా  దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములై ఉంటారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రధానులు తమదైన పరిపాలనతో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ కొందరు మాత్రమే ఆడపిల్లలను వేధించడం, మద్యం తాగి రచ్చ చేయడం వంటివి చేసి దేశానికి అపకీర్తి తెస్తుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే… ఇలా అసహ్యంగా ప్రవర్తించే వారిలో అప్పుడప్పుడు మహిళ మంత్రులు కూడా కనిపిస్తుంటారు. తాజాగా ఓ మహిళ మంత్రి.. మద్యం తాగి కారు నడిపింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.

న్యూజిలాండ్ దేశ న్యాయశాఖ మంత్రి  కిరి అలెన్ ఆదివారం రాత్రి మద్యం తాగి కారును  అతివేగంగా నడిపారు. అంతేకాక ఓ పార్కింగ్ ప్రాంతంలో ఉన్న వాహనాలను  ఆమె కారు ఢీకొట్టింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో  పోలీసులు అక్కడి చేరుకున్నారు. అనంతరం ఆమెకు బ్రీతింగ్  పరీక్ష నిర్వహించగా.. మద్యం తాగినట్లు తేలింది. ఆమె మోతాదుకు మించి మద్యం  తాగినట్లు పోలీసులు గుర్తించారు.  అంతేకాక పోలీసులపై చిందులేస్తూ అరెస్టుకు కూడా సహకరించలేదు. అతికష్టం మీద ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించి నాలుగు గంటల పాటు  అక్కడే ఉంచారు.

ఈ విషయం బయటకు గుప్పుమనడంతో ఆమె పదవికే ఎసరు వచ్చింది. విపక్ష పార్టీలు ఆమెపై తీవ్ర స్థాయిలో మండి పడ్డాయి.  అలానే మద్యం తాగి కారు నడిపిన కారణంగా  కిరి అలెన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పర్చారు. తాజాగా ఆమె  కోర్టులో కేసును ఎదుర్కొవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె సోమవారం తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇలా గతంలో కూడా కొందరు మంత్రులు, ఇతర ముఖ్యనేతలు  అశ్లీల వీడియోలు చూడటం, మద్యం తాగి రోడ్లపై రచ్చ చేసిన ఘటనలు అనేకం జరిగాయి. మరి…నలుగురికి మార్గదర్శంగా ఉండాల్సిన మంత్రులే ఇలా చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పెళ్లిలో అదిరిపోయే లుక్.. వరుడికి వెండి చెప్పులు, బెల్టు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి