iDreamPost
android-app
ios-app

పదేళ్ల పగ.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న క్రైమ్ స్టోరీ! అసలేం జరిగిందంటే?

  • Published Oct 13, 2023 | 3:13 PM Updated Updated Oct 13, 2023 | 3:13 PM
  • Published Oct 13, 2023 | 3:13 PMUpdated Oct 13, 2023 | 3:13 PM
పదేళ్ల పగ.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న క్రైమ్ స్టోరీ! అసలేం జరిగిందంటే?

పదేళ్ల నాటి పగ, ఎలాగైన ప్రతికారం తీర్చుకోవాలని ప్రత్యర్థులు భావించారు. సమయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక ఆ రోజు కూడా రానే వచ్చింది. కట్ చేస్తే.. పక్కా పథకం ప్రకారం కదిలిని దుండగులు.. ఎన్నో ఏళ్ల నుంచి రగులుతున్న ప్రత్యర్థిపై కోపాన్ని ఎట్టకేలకు తీర్చుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఈ ఘటన స్థానికుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఇంతకు ఈ క్రైమ్ స్టోరీలో ఏం జరిగింది? దుండగులను నీడలా వెంటాడిన ఆ పగకు కారణం ఏంటి? అసలేం జరిగిందంటే?

అది తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని మిర్ఖాన్ పేట్ గ్రామం. ఇక్కడే ముప్పిడి రాములు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతని వయసు 35 ఏళ్లు. ఇదిలా ఉంటే.. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వడ్డెపల్లి పరిధిలోని ఖాజపూర్ కు చెందిన కుర్మ లింగవ్వ అనే మహిళ పదేళ్ల కిందట హత్యకు గురైంది. ఈ కేసులో ముప్పిడి రాములపై అప్పట్లోనే కేసు నమోదైంది. ఇంతే కాకుండా రాములు ఏడేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించి బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు రాములుపై పదేళ్ల నుంచి పగతో రగిలిపోతునే ఉన్నారు.

ఎలాగైనా అతడిని హత్య చేయాలని పథకం రచించారు. ఆ సమయం కోసం వేచి చూస్తూనే ఉన్నారు. ఆ రోజు కూడా రానే వచ్చింది. కట్ చేస్తే.. బుధవారం రాములు ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే.. రాములును హత్య చేసి దహనం చేశారని తేలింది. ఇక మృతుని కుటుంబ సభ్యులు మాత్రం.. ఇది పక్కా గంగవ్వ కుటుంబ సభ్యుల పనేనని అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంగవ్వ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş