iDreamPost
android-app
ios-app

బస్సులో కండక్టర్ అసభ్య ప్రవర్తన.. యువతి ట్వీట్!

TGSRTC Conductor: నిత్యం ఎంతో మంది మహిళలు, యువతులు చదువు, ఉద్యోగం నిమిత్తం రోజూ బస్సులో జర్నీ చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఓ ఆర్టీసీ కండక్టర్ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

TGSRTC Conductor: నిత్యం ఎంతో మంది మహిళలు, యువతులు చదువు, ఉద్యోగం నిమిత్తం రోజూ బస్సులో జర్నీ చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఓ ఆర్టీసీ కండక్టర్ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

బస్సులో కండక్టర్ అసభ్య ప్రవర్తన.. యువతి ట్వీట్!

ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎంతో అభివృద్ధి చెందారు. అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా పోటి పడుతున్నారు. ఇంతాల అభివృద్ది  చెందిన సమాజంలో కూడా తరచూ ఏదో ఒక ప్రాంతంలో  ఆడవాళ్లు, అమ్మాయిలు వివిధ రకాల వేధింపులకు గురవుతుంటారు. ఇంటి నుంచి బయటకు  అడుగు పెట్టగానే ప్రతిక్షణం భయం భయంతోనే రోజును గుడుపుతుంటారు. ఇప్పటికే మహిళపై జరిగిన అనేక దారుణాలు వెలుగులోకి రాగా.. తాజాగా ఓ యువతి తన పట్ల ఆర్టీసీ కండక్టర్ అసభ్య ప్రవర్తను  ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అంతేకాక ఆయన్ను శిక్షించాలని కూడా కోరింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నిత్యం ఎంతో మంది మహిళలు, యువతులు చదువు, ఉద్యోగం నిమిత్తం రోజు బస్సులో జర్నీ చేస్తుంటారు. ఇక పట్టణాల్లో అయితే బస్సులో ఉండే రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినా కుటుంబం కోసం మహిళలు, తమ భవిష్యత్ కోసం అమ్మాయిలు బస్సులో ప్రయాణిస్తూ.. చదువు, ఉద్యోగాలు చేస్తుంటారు. ఆర్టీసీ బస్సులు సురక్షితమని అందులో ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. అలానే ఆర్టీసీ ఉద్యోగులు కూడా మహిళ పట్ల ఎంతో గౌరవంగా ఉంటారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తూ మంచి పేరు సంపాదిస్తున్నారు.

ఇదే సమయంలో కొందరు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అపకీర్తి తీసుకొస్తున్నారు. తాజాగా ఓ కండక్టర్ చేసిన పనిపై యువతి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తన పట్ల కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  అంతటి తో ఊరుకోక సోషల్ మీడియాలో పోస్టు చేసి.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఆర్టీసీ బస్ కండక్టర్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని హైదరాబాద్ కు చెందిన ఆ యువతి వాపోయింది. ఇక ఆయువతి ట్వీట్ ద్వారా తనకు జరిగిన చేదు అనుభవాన్ని వెల్లడించింది.conductor-misbehave-with-woman

“ఈ నెల 15న మణికొండ నుంచి హిమాయత్ నగర్ వెళ్తున్నాను. ఆధార్ కార్డు లేకపోవడంతో డబ్బులిచ్చి టికెట్ కావాలని అడిగాను. కండక్టర్  ఒక్కసారిగా  నా వైపు దూసుకొచ్చి ప్రైవేట్  పార్ట్స్ ను టచ్ చేశాడు. రెండు సెకన్లు ఏం జరిగిందో అర్థం కాలేదు. అంకుల్ ఏం చేస్తున్నావ్? అని గట్టిగా అరవగానే వెనక్కి వెళ్లిపోయాడు. అతడిపై చర్యలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేసింది.  ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో కూడా వివిధ ప్రాంతాల్లో కూడా బస్సులో మహిళపై అసభ్య ప్రవర్తనలు జరిగాయి. ఇలాంటి పోకిరీలను అరికట్టేందుకు ప్రభుత్వాలు సైతం చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ..కొందరిలో బుద్ది మారడంలేదు..చిత్తకార్తే కుక్కలాగా ప్రవర్తిస్తుంటారు.