iDreamPost
android-app
ios-app

ఇన్‌స్టా గోల్డెన్‌ బాయ్‌ కొంపముంచిన రీల్స్‌.. పరువు తీస్తానంటూ బ్లాక్‌ మెయిల్‌

  • Published Aug 31, 2023 | 1:45 PMUpdated Aug 31, 2023 | 1:45 PM
  • Published Aug 31, 2023 | 1:45 PMUpdated Aug 31, 2023 | 1:45 PM
ఇన్‌స్టా గోల్డెన్‌ బాయ్‌ కొంపముంచిన రీల్స్‌.. పరువు తీస్తానంటూ బ్లాక్‌ మెయిల్‌

సోషల్‌ మీడియా వినియోగం పెరిగాక.. రాత్రికి రాత్రి స్టార్స్‌ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక కొందరైతే.. సోషల్‌ మీడియాలో రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ సంపాదించడం కోసం.. రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఫేమస్‌ సంగతి అటుంచితే.. కొన్నిసార్లు.. వాళ్లు చేసే ప్రయత్నాల వల్ల సమస్యల పాలవ్వాల్సి వస్తుంది. ఇక తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి.. రాత్రికి రాత్రే సోషల్‌ మీడియాలో స్టార్‌ అవ్వాలని భావించాడు. ఒంటి నిండా బంగారం ధరించి.. రకరకాల వీడియోలు తీసి.. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అనుకున్నట్లుగానే అతడు రాత్రికి రాత్రే ఫేమస్‌ అయ్యాడు. దాంతో పాటు.. సమస్యల్లో కూడా చిక్కుకున్నాడు. ఇంతకు ఏం జరిగింది అంటే..

ఇన్‌స్టాగ్రామ్‌లో గోల్డెన్ బాయ్‌గా పేరుగాంచిన రీల్స్ స్టార్ ధర్మేంద్ర అలియాస్ మోను బాలాసాహెబ్ బడేకర్ (30) గురించి నెటిజనులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడికి నాలుగున్నర లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. రకరకాల వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటాడు. ధర్మేంద్రకు ఎంత క్రేజ్‌ ఉందంటే.. అతడు చేసే వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా ధర్మేంద్రకు ఓ సమస్య ఎదురయ్యింది. ఓ వ్యక్తి ధర్మేంద్ర వద్ద నుంచి భారీగా బంగారం, నగలు కాజేసి.. పారిపోయాడు. దాని గురించి ప్రశ్నిస్తే.. తిరిగి ధర్మేంద్రనే బ్లాక్‌మెయిల్‌ చేయసాగాడు.

ధర్మేంద్రను బెదిరిస్తున్న వ‍్యక్తి పేరు మహేష్ అలియాస్ మల్లప్ప సాహెబ్ హోస్మాని. కొన్ని రోజుల క్రితం అతడికి ధర్మేంద్రతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మల్లప్ప.. ధర్మేంద్ర వద్ద 18 తులాల బంగారు గొలుసు తీసుకెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత ధర్మేంద్ర తన బంగారు గొలుసును తిరిగి ఇవ్వాల్సిందిగా మల్లప్పను అడిగాడు. అయితే నిందితుడు.. గొలుసు ఇవ్వలేదు సరికదా.. తనకు 3 లక్షల రూపాయలు ఇవ్వాలని  రివర్స్‌లో ధర్మేంద్రనే  బెదిరించసాగాడు. అంతేకాక.. సోషల్‌ మీడియాలో ధర్మేంద్ర పరువు తీస్తానంటూ చెప్పుకొచ్చాడు.

‘‘నేను కరడుగట్టిన దొంగనని.. నేను దొంగతనం చేసిన బంగారమంతా నీ దగ్గరకు తీసుకువస్తున్నట్లు పోలీసులకు చెబుతాను. నువ్వు పెద్ద రీల్ స్టార్‌వి కదా.. ఇప్పుడు నీ పరువు ఎలా తీస్తానో చూడు. గొలుసు తిరిగి ఇవ్వడం కుదరదు. నీ పరువు పోకుండా ఉండాలంటే నువ్వే నాకు మూడు లక్షల రూపాయలు ఇవ్వు. లేకపోతే నేను దొంగతనం చేసిన బంగారం నీకు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో చెప్పి, నీ పరువు తీస్తా. అప్పుడు నువ్వు గోల్డెన్ బాయ్‌వి ఎలా అయ్యావో నీ ఫాలోవర్స్‌కి తెలుస్తుందంటూ’’ ధర్మేంద్రను బెదిరించసాగాడు నిందితుడు.

దాంతో భయపడిపోయిన ధర్మేంద్ర.. నిందితుడు అడిగినట్లుగానే అతడికి రెండు లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆ తర్వాత కూడా నిందితుడు.. ధర్మేంద్రను డబ్బుల కోసం బెదిరిస్తుండటంతో.. ఏం చేయాలో తెలియక.. పోలీసులను ఆశ్రయించాడు ధర్మేంద్ర. కేసు నమోదు చేసిన పోలీసులు.. మహేష్‌ కోసం గాలిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి