iDreamPost
android-app
ios-app

ప్రియుడి మాయలో పడి మహిళ దారుణం! ఎంతకు తెగించిందంటే?

  • Published Oct 06, 2023 | 3:19 PM Updated Updated Oct 06, 2023 | 3:19 PM
  • Published Oct 06, 2023 | 3:19 PMUpdated Oct 06, 2023 | 3:19 PM
ప్రియుడి మాయలో పడి మహిళ దారుణం! ఎంతకు తెగించిందంటే?

ఈ రోజుల్లో కొందరు పెళ్లైన మహిళలు పడక సుఖం ఎంతకైన తెగిస్తున్నారు. ఇంట్లో తాళికట్టిన భర్త ఉండగానే మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అసలు విషయం భర్తకు తెలియడంతో ప్రియుడితో చేతులు కలిపి కట్టుకున్న మొగుడిని కాటికి పంపుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా రోజుకొక చోట జరుగుతూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా రాజస్థాన్ లో చోటు చేసుకుంది. ఇదే వార్త ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ లోని ఓ ప్రాంతంలో విశ్వనాథ్-మమత దంపతులు నివాసం ఉంటున్నారు. చాలా ఏళ్ల కిందటే వీరికి వివాహం జరిగింది. అయితే భర్త విశ్వనాథ్ జైపూర్ లో ఈ-రిక్షా నడుపుతూ ఉండేవాడు. అక్కడే ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వస్తుండేవాడు. కాగా, బతుకు దెరువు కోసం భర్త జైపూర్ వెళ్లడంతో భార్య మమత మాత్రం ఇంటి వద్దే ఉండేది. ఈ క్రమంలోనే ఈ మహిళ స్థానికంగా ఉండే మహేష్ కుమార్ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. ఇదే పరిచయం చివరికి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారింది. ఇక మమత సమయం దొరికినప్పుడల్లా ప్రియుడిని ఇంటికి పిలుచుకుని ఎంజాయ్ చేసేది.

భర్త విశ్వనాథ్ ఇంటికి వచ్చి పోతున్న క్రమంలో భార్య చీకటి కాపురం అతనికి తెలిసిపోయింది. దీంతో భర్త బుద్దిమార్చుకోవాంటూ భార్యకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అయితే ప్రియుడి మాయలో ఉన్న ఆ మహిళ.. భర్త మాటలు అస్సలు లెక్క చేయకుండా అతడితో తిరుగుతూ ఉండేది. ఇకపోతే.. ప్రియుడితో గడిపేందుకు భర్త అడ్డుగా ఉండడంతో మమత మొగుడిని ప్రాణాలతో లేకుండా చేసి ప్రియుడితోనే ఉండాలని పథకం రచించింది. ఇదే విషయాన్ని ప్రియుడు మహేష్ కుమార్ కు చెప్పడంతో అతడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక పక్కా ప్లాన్ ప్రకారమే.. మమత కొందరు యువకులకు డబ్బు ఆశచూపి ప్రియుడితో కలిసి అక్టోబర్ 2న భర్తను దారుణంగా హత్య చేయించింది.

ఆ తర్వాత మమత ఏం తెలియనట్టుగా మొసలి కన్నీరు కార్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొదటగా భార్య మమతను విచారించగా తప్పించుకునే ప్రయత్నం చేసింది. మొత్తానికి పోలీసుల స్టైల్ లో విచారించే సరికి మమత.. ప్రియుడితో ఉండేందుకు నేనే నా భర్తను హత్య చేయించానని చేసిన నేరాన్ని ఒప్పుకుంది. అనంతరం పోలీసులు ప్రధాని నిందితురాలైన మమతతో పాటు ఆమె ప్రియుడు మహేష్ కుమార్, మరో ఇద్దరి యువకులను అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ప్రియుడి కోసం భర్తను చంపిన ఈ భార్య దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş