iDreamPost
android-app
ios-app

ఘోరం: నాలుగేళ్ల చిన్నారిపై ఎస్సై అత్యాచారం! ఎక్కడో కాదు..!

పోలీస్ శాఖలో ఉన్నతమైన హోదాలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ అభం, శుభం తెలియని 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఈఘటన ఎక్కడ జరిగిందంటే?

పోలీస్ శాఖలో ఉన్నతమైన హోదాలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ అభం, శుభం తెలియని 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఈఘటన ఎక్కడ జరిగిందంటే?

ఘోరం: నాలుగేళ్ల చిన్నారిపై ఎస్సై అత్యాచారం! ఎక్కడో కాదు..!

సమాజంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. తల్లి, చెల్లి అనే తేడా లేకుండా వావి వరసలు మరిచి అత్యాచారాలకు తెగ బడుతున్నారు. ఇక రోడ్డుపై అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు.. ఐలవ్ యూ చెప్పడం.., కాదంటే అత్యాచారాలు, హత్యలు చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. అంతేందుకు.. పసి పిల్లలను కూడా వదలకుండా కామాంధులు లైంగిక దాడులు చేస్తున్నారు. అయితే, అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి చోటు చేసుకుంది. పోలీస్ శాఖలో ఉన్నతమైన హోదాలో ఉన్న సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అభం, శుభం తెలియని 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. అసలు విషయం వెలుగులోకి రావడంతో బాధిత బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘోరమైన ఘటన ఎక్కడ జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ దౌసా జిల్లాలోని రహువాస్ పరిధిలోని లాల్ సాట్ ఏరియాలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల చిన్నారి ఉంది. అయితే ఇక్కడే ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి.. అభం, శుభం తెలియని ఆ చిన్నారిపై కన్నేశాడు. ఎలాగైనా ఆ పసి పాపతో కోరిక తీర్చుకోవాలని తహతహలాడాడు. ఇక ఆ దుర్మార్గుడు అనుకున్నట్లే.. తాజాగా ఆ చిన్నారిపై అతి దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇదే విషయం ఆ బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో ఒక్కసారిగా షాక్ గురై కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఆ చిన్నారి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ఎస్సైని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది.

ఇదిలా ఉంటే.. ఈ దారుణ ఘటన బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులకు తెలియడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. హుటాహుటిన అంతా వందల సంఖ్యలో ఆ పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. అభం, శుభం తెలియని 4 ఏళ్ల చిన్నారిపై దారుణానికి పాల్పడిన ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి వారికి సర్ది చెప్పారు. ఈఘోరమైన ఘటనపై రాజస్థాన్ ప్రభుత్వం కూడా స్పందించినట్లుగా సమాచారం. ఇలాంటి ఘటనలు జరగడం చాలా దారుణమని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని తెలిపింది.

దీంతో పాటు బాధిత బాలిక కుటుంబాన్ని కూడా అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఉన్న మానవవాదులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆ చిన్నారిపై ఘోరమైన చర్యకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ దారుణంపై నెటిజన్స్ స్పందిస్తూ.. ఇలాంటి వారిని నడి రోడ్డుపై ఉరి తీయాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అభం, శుభం తెలియని 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఈ దుర్మార్గుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి