iDreamPost
android-app
ios-app

అమానుషం: భర్త రూ. 770 కట్టలేదని.. భార్యను నిర్బంధించిన ప్రైవేట్ బ్యాంక్!

లక్షలు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్లను వదిలేసి.. సామాన్యులపై ప్రతాపాన్ని చూపుతున్నాయి కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్. రూ.10 చెల్లించాల్సి ఉన్నా. . పది సార్లు కాల్ చేసి చావగొడుతుంటారు. ఇదిగో ఇప్పుడు మరో ప్రైవేట్ బ్యాంక్ నిర్వాకం బయటకు వచ్చింది.

లక్షలు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్లను వదిలేసి.. సామాన్యులపై ప్రతాపాన్ని చూపుతున్నాయి కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్. రూ.10 చెల్లించాల్సి ఉన్నా. . పది సార్లు కాల్ చేసి చావగొడుతుంటారు. ఇదిగో ఇప్పుడు మరో ప్రైవేట్ బ్యాంక్ నిర్వాకం బయటకు వచ్చింది.

అమానుషం: భర్త రూ. 770 కట్టలేదని.. భార్యను నిర్బంధించిన ప్రైవేట్ బ్యాంక్!

రోజు రోజుకు ప్రైవేట్ బ్యాంకుల అరాచకం పెరిగిపోతుంది. కస్టమర్లకు ఫోన్లు చేసి.. లోన్స్ తీసుకుంటారా, క్రెడిట్ కార్స్ కావాలా అని చావగొట్టడమే కాకుండా.. రుణాలు తీసుకున్నాక వాయిదా సమయం అలా దాటి ఒక్క రోజు ఆలస్యమైనా వెంటనే కాల్స్ చేసి వేధిస్తుంటారు. అవసరమైతే ఏజెంట్లను ఇంటికి పంపి మరీ గొడవ చేయిస్తుంటాయి. ఆ కుటంబ పరువును బజారున పడేస్తుంటాయి.  లక్షలు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్లను వదిలేసి.. సామాన్యులు, రైతులపై ప్రతాపాన్ని చూపుతున్నాయి కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్.  సాధారణంగా అప్పులు కట్టకపోతే.. ప్రైవేట్ బ్యాంకులు ఇల్లు, ఆస్తులు జప్తు చేయడమో లేకుంటే.. విలువైన వస్తువులు తీసుకెళ్లడమో చేస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన ఒళ్లు గగొర్పడవడం ఖాయం. ఒక్క రూపాయి అప్పు ఉన్న బ్యాంకులు ఎలా సామాన్యులు హింసిస్తాయో ఈ సంఘటన ఓ ఉదాహరణ

భర్త బ్యాంకు రుణం చెల్లించలేదని భార్యను  నిర్బంధించిన అమానుష ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లా వాజప్పాడికి సమీపాన ఉన్న దుకియంబాలయం అనే ప్రాంతానికి చెందిన ప్రశాంత్ కూలీ పనులు చేసుకుని బతుకుతున్నాడు. ఆర్థిక సమస్యలు దృష్ట్యా ఇటీవల సమీప ప్రైవేట్ బ్యాంకులో రూ. 35 వేల రుణం తీసుకున్నాడు. 52 వారాల పాటు రూ. 770 చొప్పున చెల్లించాల్సి ఉంది. ప్రతి వారం కచ్చితంగా డబ్బులు కట్టుకుంటూ వస్తున్నాడు అతడు. అయితే ఈ వారం చెల్లించలేకపోయాడు. దీంతో ఆ ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఉద్యోగి ఒకరు.. ఆ డబ్బును వసూలు చేసేందుకు ప్రశాంత్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో అతడు లేకపోవడంతో భార్యను బ్యాంకు రావాలంటూ పిలిచాడు.

Bank punished wife for husband not paid amount

వివరాలు తీసుకుని పంపించేస్తారని భావించిన భార్య బ్యాంకుకు వెళ్లింది. అక్కడకు తీసుకెళ్లాక ఆమెను అక్కడే బంధించారు. బ్యాంక్ ఉద్యోగి అతని భార్య ద్వారా భర్తను సంప్రదించాడు. ‘నీ భార్యను బ్యాంకులో బంధించాం.. ఈ వారం వాయిదా కట్టి ఆమెను ఇంటికి తీసుకెళ్లు’ అని చెప్పడంతో పరుగెత్తుకుంటూ బ్యాంకుకు వెళ్లాడు. వాయిదా చెల్లించకుంటే ఆమెను వదిలేది లేదని తేల్చి చెప్పడంతో సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు ప్రశాంత్. ఈ వారం వాయిదా 770 రూపాయలను పోలీసుల సమక్షంలో బ్యాంకులో చెల్లించి భార్యను ఇంటికి తీసుకెళ్లాడు భర్త. ప్రైవేట్ బ్యాంకు దారుణమైన చర్యకు వ్యతిరేకంగా ఖాతాదారులు, ప్రజలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ బ్యాంకు దారుణలపై మండిపడుతున్నారు. కేవలం 770 రూపాయల కోసం భార్యను బంధించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.