దారితప్పి దట్టమైన అడవిలోకి వృద్దురాలు.. 2 రాత్రుళ్లు మృగాల మధ్యే..!

ఉన్నట్టుండి ఓ 85 ఏళ్ల వృద్దురాలు దారి తప్పి దట్టమైన అడవిలోకి ప్రవేశించింది. ఆ వృద్ధురాలు ఏకంగా 2 రాత్రుళ్లు మృగాల మధ్య అడవిలో గడిపింది. అసలేం జరిగిందంటే?

ఉన్నట్టుండి ఓ 85 ఏళ్ల వృద్దురాలు దారి తప్పి దట్టమైన అడవిలోకి ప్రవేశించింది. ఆ వృద్ధురాలు ఏకంగా 2 రాత్రుళ్లు మృగాల మధ్య అడవిలో గడిపింది. అసలేం జరిగిందంటే?

ఈమె పేరు శారదమ్మ, వయసు 85 ఏళ్లు. రోజులాగే ఇటీవల కూడా ఆ వృద్దురాలు పశువులను మేపడానికి అడవిలోకి వెళ్లింది. కానీ, ఆ రోజు సాయంత్రం దారి తప్పి ఏకంగా ఆమె దట్టమైన అటవిలో అడుగు పెట్టింది. ఇక ఆమె చూస్తుండగానే చీకటి ఏర్పడింది. పైగా ఆ అడవిలో మృగాలు ఎక్కువ. ఆ సమయంలో ఆమెకు ఎటు వెళ్లాలో తెలియక ప్రాణ భయంతో బిక్కు బిక్కుమంటూ రాత్రంతా నరకం చూసింది. ఒక పక్క పశువులతో వెళ్లిన శారదమ్మ సాయంత్రమైన ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు అంతటా వెతికారు. చీకటి పడడంతో వారికి ఎటు వెళ్లాలో తెలియక పోలీసులకు సమాచారం అందించారు. ఇక మరుసటి రోజు కూడా శారదమ్మ కోసం ఆమె కుటుంబ సభ్యులు అడవి అంతా జల్లెడపట్టారు. కానీ, శారదమ్మ ఆచూకి మాత్రం దొరకలేదు. ఆ వృద్దురాలు ఆ దట్టమైన అడవిలో మృగాల మధ్య ఏకంగా రెండు రాత్రుళ్లూ చస్తూ బతికింది. ఇంతకు శారదమ్మకు ఏం జరిగింది?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక శివమొగ్గ హోసనగర పరిధిలోని సదగల్లు గ్రామంలో శారదమ్మ (85) అనే వృద్దురాలు నివాసం ఉంటుంది. అయితే వీరికున్న కొన్ని పశువులను శారదమ్మ రోజూ అడవిలోకి తీసుకెళ్లి మెపుకుని తిరిగి ఇంటికి తీసుకొచ్చేది. ఇక ఎప్పటిలాగే ఆ వృద్ధురాలు ఆదివారం తన పశువులను తీసుకుని స్థానికంగా ఉన్న ఓ అడవికి వెళ్లింది. కానీ, ఆ రోజు పశువులు దారి తప్పడంతో ఆ మహిళ వాటి వెంటే వెళ్లింది. సాయంత్రం 6 దాటింది. నిమిషం నిమిషానికి చీకటి పెరిగిపోయింది. దీంతో శారదమ్మ పశువుల కొరకు వెతుకుతూ ఏకంగా దట్టమైన అడవిలోకి ప్రవేశించింది. పైగా ఆ అడవిలో వన్య వృగాలు ఎక్కువ. ఆ సమయంలో ఆమెకు ఎటు వెళ్లాలో తెలియక ప్రాణ భయంతో బిక్కు బిక్కుమంటూ శారదమ్మ నరకం చూసింది.

పశువులతో పాటు వెళ్లిన శారదమ్మ తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కంగారుపడి చుట్టు పక్కల ప్రాంతాల్లో అంతటా వెతికారు. కానీ, ఆ వృద్దురాలి ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అటవీ అధికారుల సాయంతో పోలీసులు అడవిలో శారదమ్మకు కోసం ఏకంగా రెండు రాత్రుళ్లు వెతికారు. ఇక మరుసటి రోజు పోలీసులు ఆ వృద్దురాలిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు. శారదమ్మ తిరిగి ఇంటికి రావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆనందంతో మురిసిపోయారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Show comments