iDreamPost
android-app
ios-app

పోలీస్‌ వక్రబుద్ధి.. సీసీ కెమెరాల్లో అడ్డంగా దొరికిపోయాడు!

పోలీస్‌ వక్రబుద్ధి.. సీసీ కెమెరాల్లో అడ్డంగా దొరికిపోయాడు!

విరోధిని కేసులో ఇరికించాలన్న దుర్భుద్ధి ఓ పోలీస్‌ పాలిట బూమరాంగ్‌ అయింది. ఆ పోలీస్‌ వేసిన ప్లాన్‌ సీసీ కెమెరాల కారణంగా అట్టర్‌ ప్లాప్‌ అయింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అతడు తీసుకున్న గోతిలో అతడే పడ్డాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌కు.. కోచింగ్‌ సెంటర్‌ నిర్వహించే ఓ టీచర్‌ కుటుంబాలకు మధ్య గత కొన్నేళ్ల నుంచి గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీచర్‌పై కక్ష తీర్చుకోవాలని పోలీస్‌ భావించాడు.

ఇందుకోసం ఓ పక్కాప్లాన్‌ వేశాడు. టీచర్‌కు చెందిన బైకులో ఓ పిస్టల్‌ ఉంచాడు. ఆ టీచర్‌ అక్రమ ఆయుధాలను కలిగి ఉన్నాడంటూ స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. పోలీసులు టీచర్‌ ఇంటిపై రైడ్‌ చేయగా.. బైకులో పిస్టల్‌ దొరికింది. దీంతో పోలీసులు అక్రమ ఆయుధాల చట్టం కింద టీచర్‌ను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సీసీ టీవీ కెమెరాలను పరీక్షించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

ఆ పోలీస్‌.. టీచర్‌ బైకులో పిస్టల్‌ పెడుతున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. అధికారులు టీచర్‌ను వెంటనే విడుదల చేశారు. కానిస్టేబుల్‌పై దర్యాప్తు ఆదేశించారు. ప్రస్తుతం పోలీస్‌.. టీచర్‌ బైకులో పిస్టల్‌ పెడుతున్న దృశ్యాలకు సంబంధించిన సీసీ టీవీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోలీస్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని అంటున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş