Tirupathi Rao
Nellore SP On Narayana Institute: నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ మీట్ పెట్టి నారాయణ విద్యా సంస్థల పేరిట జరిగిన మోసాన్ని వెల్లడించారు.
Nellore SP On Narayana Institute: నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ మీట్ పెట్టి నారాయణ విద్యా సంస్థల పేరిట జరిగిన మోసాన్ని వెల్లడించారు.
Tirupathi Rao
నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు జరిపారు. అయితే ఈ సోదాలు ఎందుకు చేశారు? అనే విషయంపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. అసలు ఈ సోదాలు ఎందుకు జరిగాయి అనే విషయాన్ని నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మీడియాకి వెల్లడించారు. అలాగే ఈ సోదాలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా మాజీ మంత్రి నారాయణ ఏం మోసం చేశారు? ఎంత మేర ప్రభుత్వానికి గండి కొట్టాలని చూశారు? అనే విషయాలను కూడా వివరంగా చెప్పారు.
అసలు జరిగింది ఏంటంటే.. నారాయణ విద్యా సంస్థలకు అనుబంధంగా ఇన్ స్పైరా అనే సంస్థ ఉంది. నారాయణ సంస్థల్లో డైరెక్టర్ గా ఉండే పునీత్ అనే వ్యక్తి ఇన్ స్పైరాకు కూడా డైరెక్టర్ గా ఉన్నాడు. నారాయణ విద్యా సంస్థలు ఆ ఇన్ స్పైరా సంస్థతో 2023లో ఒక ఒప్పందం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఆ ఒప్పందం ప్రకారం ఇన్ స్పైరా సంస్థ రూ.20 కోట్లకు 92 కొత్త బస్సుల కోసం ఆర్డర్ పెట్టింది. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. ఇన్ వాయిస్ మాత్రం నారాయణ విద్యా సంస్థల పేరు మీద ఉన్న విషయాన్ని జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
ఇక్కడ నారాయణ సంస్థలు- ఇన్ స్పైరా సంస్థ చేసిన గోల్ మాల్ ఏంటంటే.. విద్యా సంస్థలకు చెందిన వాహనాలకు పన్ను తక్కువగా ఉంటుంది. అందుకే ఇన్ స్పైరా సంస్థ తమకు కావాల్సిన బస్సులను కొనుగోలు చేస్తు ఇన్ వాయిసి మాత్రం నారాయణ విద్యా సంస్థల పేరిట తీసుకున్నారు. ఈ విషయానికి సంబంధించి రవాణా అధికారులకు సమాచారం అందగా.. పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఈ ఫిర్యాదు ప్రకారం సోదాలు నిర్వహించగా.. అసలు విషయం వెలుగు చూసింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. బస్సులను నారాయణ విద్యా సంస్థల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. కానీ, ఇన్ స్పైరా సంస్థకు మాత్రం నెల నెలా బస్సులకు సంబంధించి అద్దె చెల్లిస్తున్న విషయాన్ని జిల్లా ఎస్పీ వెల్లడించారు.
ఆ బస్సుల యజమాని నారాయణ విద్యా సంస్థలు అంటూ ఇన్ స్పైరా కూడా రావాణా శాఖకు చూపించింది. కానీ, అద్దె మాత్రం వసూలు చేయడం విశేషం. ఇలా వాళ్లు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేందుకు చేసిన ప్రయత్నం తేటతెల్లమైంది. అంతేకాకుండా పోలీసులు చేసిన సోదాల్లో రూ.1.81 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బుకు సంబంధించి ఎలాంటి ఎలాంటి లెక్కలు కూడా చూపించలేదు. ఆ మొత్తాన్ని పోలీసులు ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి విచారణ చేపట్టడమే కాకుండా.. పునీత్ పై కేసు నమోదు చేశారు. ఇలా పేరు మార్చి రిజిస్ట్రేషన్ చేయడం వల్ల రూ.10 కోట్లు పన్ను చెల్లించాల్సిన దగ్గర కేవలం రూ.22.24 లక్షలు మాత్రమే పన్ను చెల్లించారంటూ అధికారులు వెల్లడించారు. అలాగే జీఎస్టీ విషయంలో కూడా అవకతవకలకు పాల్పిడనట్లు గుర్తించి విషయాన్ని తెలియజేశారు.