శివబాలకృష్ణ తరహాలో.. ACBకి చిక్కిన మరో అవినీతి తిమింగలం!

Nalgonda Govt Hospital: ఇటీవలే హెచ్ఎండీ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి సొమ్ముతో ఏసీబీ అధికారులతో దొరికిపోయారు. ఆయన నుంచి ఏసీబీ భారీ మొత్తంలో నగదను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటన మరువక ముందే ఇదే తరహాలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది.

Nalgonda Govt Hospital: ఇటీవలే హెచ్ఎండీ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి సొమ్ముతో ఏసీబీ అధికారులతో దొరికిపోయారు. ఆయన నుంచి ఏసీబీ భారీ మొత్తంలో నగదను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటన మరువక ముందే ఇదే తరహాలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది.

ప్రస్తుతం సమాజంలో నీతి, నిజాయితి అనేవి మనషుల్లో కనుమరుగవుతున్నాయి. అవినీతి, అక్రమ మార్గంలో వచ్చే సంపాదన కోసం ఆరాటపడే వారి సంఖ్య ఎక్కువైంది. పరుల సొమ్ము పాము వంటిదనే విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల్లో కొందరు ఈ విషయాన్ని మర్చి..ప్రవర్తిస్తున్నారు. అవినీతి సముద్రంలో ఈతకొడుతున్నారు.  ఎంతో మంది సామాన్య ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నారు. ఇటీవలే హెచ్ఎండీఏ మాజీ  డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ అధికారులకు దొరికిన సంగతి తెలిసిందే. ఈయన నుంచి వందల కోట్ల విలువన సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ శివబాలకృష్ణ తరహాలోనే మరో అవినీతి తిమింగలం ఏసీపీ అధికారులకు దొరికింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దా…

వైద్యులు అంటే ప్రజలకు దేవుళ్ల తో సమానం. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రులో విధులు నిర్వహించే డాక్టర్లు, అక్కడి అధికారులు అంటే ప్రజలకు మరింత గౌరవం. కారణం.. ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే డాక్టర్లు, అధికారులు ఎంతో  అనుభవం కలిగిన వారు. ప్రజలకు మంచి సేవ చేస్తారని ప్రజలు భావిస్తుంటారు. అందుకు తగ్గినట్లే చాలా మంది ప్రభుత్వ అధికారులు, వైద్యులు నిజాయితీగా విధులు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతుంటారు. అయితే మరికొందరు మాత్రం అవినీతి సొమ్ముకు అలవాటు పడి.. ప్రజలను పట్టిపీడిస్తుంటారు.

తాజాగా నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ లచ్చు నాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మెడిసిన్ టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి ఈ మొత్తాన్ని లచ్చు నాయక్  డిమాండ్‌ చేశారు. గత రెండేళ్లు ప్రభుత్వ ఆస్పత్రులకు మందులను వెంకన్న సప్లయ్ చేసేవాడు. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా సూపరింటెండెంట్‌ లచ్చు నాయక్ 10 శాతం కమీషన్‌ తీసుకుంటున్నారని వెంకన్న తెలిపాడు. అయితే ఇటీవల ఇస్తున్న దాని కాంటే అధికశాతం కావాలని డిమాండ్‌ చేసినట్లు బాధితుడు వెల్లడించాడు. నెలరోజుల క్రితం రూ.లక్ష లంచంగా ఇవ్వగా.. నాలుగు రోజుల క్రితం మరో రూ. 3 లక్షలు డిమాండ్‌ చేయడంతో వెంకన్న విసుకు చెందాడు. వెంటనే ఏసీబీని ఆశ్రయించినట్లు వెంకన్న తెలిపారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన సూచనల ప్రకారం వెంకన్న ఫాలో అయ్యాడు.

శుక్రవారం ఆయన నివాసంలో వెంకన్న నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. రూ.3 లక్షలు తీసుకుంటుండగా లచ్చు నాయక్ ను ఏసీబీ పట్టుకుంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి అవినీతి తిమింగలాల గురించి నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలే హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో దొరికిన అవినీతి సొమ్మును చూసి ఏసీబీ అధికారులో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సమాజంలోని చీడ పురుగులను తొలగించాల్సిన ప్రభుత్వ అధికారులే చీడ పురుగుల్లా మారి.. అపకీర్తి మూటకట్టుకుంటున్నారు. మరి.. ఇలాంటి అవినీతి అధికారులను ఏ విధంగా శిక్షించాలి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments