iDreamPost
android-app
ios-app

తాగుబోతు కొడుకు దారుణం.. తల్లి మద్యానికి డబ్బులు ఇవ్వలేదని నడి రోడ్డుపై..!

తాగుబోతు కొడుకు దారుణం.. తల్లి మద్యానికి డబ్బులు ఇవ్వలేదని నడి రోడ్డుపై..!

ఈ రోజుల్లో మద్యం తాగడం అనేది ఓ ట్రెండ్ గా మారిపోతోంది. ఇంటర్ పోరగాళ్ల నుంచి ఇంట్లో ఉన్న వృద్ధుల వరకు అందరూ ఆల్కహాల్ కు అలవాటు పడుతున్నారు. ఇకపోతే, తెలంగాణలోని ఓ ప్రాంతానికి చెందని ఓ యువకుడు పూర్తిగా మద్యానికి అలవాటు పడ్డాడు. మందు తాగనిదే పూట గడవదు అన్నట్లుగా బానిసయ్యాడు. అయితే, ఇటీవల ఓ రోజు మద్యం తాగాలని అనుకున్నాడు. కానీ, అతని చేతిలో చిల్లి గవ్వలేదు. దీంతో వెంటనే తల్లిని అడిగాడు. డబ్బులు లేవని తల్లి చెప్పింది. అయినా సరే పట్టుబట్టి తల్లిని అడిగాడు. ఇక కోపంతో ఊగిపోయిన ఆ తల్లి డబ్బులు లేవంటూ కుమారుడికి తెగేసి చెప్పింది. ఇదే కోపంతో ఆ యువకుడు నడి రోడ్డుపై తల్లి అని చూడకుండా దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?

స్థానికుల కథనం ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పద్మమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె భర్త గతంలోనే మరణించాడు. దీంతో ఆ మహిళ స్థానికంగా ఉన్న ఓ హోటల్ లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఆమెకు సంతోష్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ఇతడు పూర్తిగా మద్యానికి అలవాటు పడి తాగుబోతుగా మారిపోయాడు. రోజూ మద్యం తాగుతూ జులాయిగా తిరుగుతున్నాడు. అయితే, తాజాగా మద్యం తాగడానికి డబ్బులు లేకపోవడంతో తల్లిని అడిగాడు. నా వద్ద లేవని తల్లి పద్మమ్మ చెప్పింది.

ఇదే విషయమై సంతోష్ తల్లితో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే పట్టరాని కోపంతో ఊగిపోయిన సంతోష్.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే తల్లిని దారుణంగా కొట్టాడు. పిడిగుద్దులతో తల్లి అని కూడా చూడకుండా ఆమెపై దాడి చేశాడు. స్థానికులు వెంటనే స్పందించి అతడి నుంచి పద్మమ్మను రక్షించారు. వెంటనే ఆ దుర్మార్గుడిని పోలీసులకు అప్పగించారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చితకబాదిన ఈ దుర్మార్గుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: స్కూల్ కు బొట్టుపెట్టుకుని వెళ్లిన విద్యార్థిని.. టీచర్ చేసిన పనికి అంతా షాక్!

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet