Uppula Naresh
పైన ఫోటోలో కనిపిస్తున్న ఇతగాడి పేరు మొయినుద్దీన్. నమ్మించి ఈ మహిళను పెళ్లి చేసుకున్నాడు. కానీ, రాత్రిళ్లు అతడు చేసిన పనికి భార్య తట్టుకోలేకపోయింది. ఇంతకు ఈ దుర్మార్గుడు ఏం చేశాడో తెలుసా?
పైన ఫోటోలో కనిపిస్తున్న ఇతగాడి పేరు మొయినుద్దీన్. నమ్మించి ఈ మహిళను పెళ్లి చేసుకున్నాడు. కానీ, రాత్రిళ్లు అతడు చేసిన పనికి భార్య తట్టుకోలేకపోయింది. ఇంతకు ఈ దుర్మార్గుడు ఏం చేశాడో తెలుసా?
Uppula Naresh
పైన ఫొటోలో కనిపిస్తున్న వీళ్లిద్దరు భార్యాభర్తలు. గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు సంతోషంగానే ఉన్నారు. కానీ, రాను రాను భర్త తన బుద్దిని పూర్తిగా మార్చుకున్నాడు. కోరి వెంట వచ్చిన భార్యను చిత్ర హింసలకు గురి చేస్తూ దారుణాలకు పాల్పడేవాడు. మరీ ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి రాత్రి వేళల్లో కట్టుకున్న భార్యను అని చూడకుండా అలా టార్చర్ చేస్తూ వేధింపులకు పాల్పడేవాడు. ఇక గురువారం రాత్రి భర్త ఊహించని కిరాతకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇతడు చేసిన పనికి అంతా షాక్ కు గురవుతున్నారు. ఇంతకు ఇతగాడు చేసిన పనేంటి? ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ముంబైలోని మలాడ్ పరిధిలోని మాల్విడ్ ప్రాంతంలో మొయినుద్దీన్ అన్సారీ-పర్వీన్ అన్సారీ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి కొంత కాలం పాటు సంతోషంగానే ఉన్నారు. కాగా, భర్త ఓ చోట పని చేస్తుండగా భార్య ఇంటి వద్దే ఉండేది. అలా వారి సంసారం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇకపోతే, రాను రాను భర్త మొయినుద్దీన్ మద్యానికి అలవాటు పడ్డాడు. ఇంట్లో భార్యను మరిచి పోయి రోజూ అతిగా మద్యం తాగి ఇంటి కొచ్చేవాడు. ఇంతే కాకుండా మద్యానికి డబ్బులు ఇవ్వాలని భార్య పర్వీన్ అన్సారీపై వేధింపులకు పాల్పడేవాడు. భర్త టార్చర్ ను తట్టుకోలేని భార్య ఓపికతో గమనిస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఎప్పటిలాగే గురువారం రాత్రి కూడా భర్త మొయినుద్దీన్ అతిగా మద్యం సేవించి ఇంటికొచ్చాడు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని భార్యను అడిగాడు. దీనికి పర్వీన్ లేవని సమాధానమిచ్చింది.
దీంతో భర్తకు కోపం కట్టలు తెంచుకుంది. ఇక ఇదే విషయంపై ఇద్దరూ గొడవ పడ్డారు. క్షణికావేశంలో ఊగిపోయిన భర్త మొయినుద్దీన్.. భార్యను అతి దారుణంగా కొట్టాడు. ఇతడి దాడిలో పర్వీన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భార్య చనిపోయిందన్న విషయం తెలుసుకుని మొయినుద్దీన్ ముంబై పారిపోవాలని అనుకున్నాడు. అనంతరం స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేసట్టారు. ఈ క్రమంలోనే ఆ దుర్మార్గుడు పోలీసుల కళ్లు గప్పి ముంబై పారిపోవాలని చూడగా అరెస్ట్ చేశారు. ఇతడు చేసిన దారుణం తెలుసుకుని మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలకంగా మారుతోంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను కొట్టి చంపిన భర్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.