iDreamPost
android-app
ios-app

ట్రైనీ హెయిర్ హోస్టెస్ హత్య ఘటన.. కీలక విషయాలు వెలుగులోకి..!

  • Published Sep 05, 2023 | 6:55 PM Updated Updated Sep 05, 2023 | 6:55 PM
  • Published Sep 05, 2023 | 6:55 PMUpdated Sep 05, 2023 | 6:55 PM
ట్రైనీ హెయిర్ హోస్టెస్ హత్య ఘటన.. కీలక విషయాలు వెలుగులోకి..!

ముంబైలో ట్రైనీ హెయిర్ హోస్టెస్ రూపాల్ అనే యువతి ఆదివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాదాపు 45 మంది అనుమానితులను విచారించారు. ఇక అన్ని కోణాల్లో విచారించి ఎట్టకేలకు నిందితుడు విక్రమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించి కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. నిందితుడు ఆ యువతిని హత్య చేసి ఆ తర్వాత దొరకకుండా ఉండేందుకు సరికొత్త ప్లాన్ ను అమలు పరిచాడు. అదేంటంటే?

ముంబైలోని అంధేరి ఆదివారం విక్రమ్ అనే యువకుడు ట్రైనీ హెయిర్ హోస్టెస్ రూపాల్ ను కత్తితో గొంతు అతి దారుణంగా హత్య చేశాడు. ఇక హత్య అనంతరం దుండగుడు తప్పించుకునేందుకు కాస్త తెలివిని ప్రయోగించాడు. ఆ యువతిని హత్య చేసిన తర్వాత రెండు గంటల పాటు అతడు అందులోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? హత్య సమయంలో అతనిపై పడ్డ రక్తపు మరకలు కనిపించకుండా ఉండేందుకు అతడు అదే రూమ్ లోనే బట్టలు ఊతుకున్నట్లు పోలీసుల తాజా విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే?

ఛత్తీస్ గఢ్ కు చెందిన రూపాల్ (25) అనే యువతి ముంబై శివారులోని అంధేరి ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆమె ప్రస్తుతం ట్రైనీ హెయిర్ హోస్టెస్ గా శిక్షణ తీసుకుంటున్నారు. అయితే సోసైటీలో స్వీపర్ గా పని చేస్తున్న విక్రమ్ అనే యువకుడు ఆదివారం సాయంత్రం రూపాల్ ఉంటున్న రూమ్ లోకి వెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆ యువతి ప్రతిఘటించడంతో ఆమెను ఇంట్లో ఉన్న కత్తితో హత్య చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో రూపాల్ కు ఆమె కుటుంబ సభ్యులు అనేక సార్లు ఫోన్ చేశారు. ఎంతకు స్పందించలేదు. దీంతో రూపాల్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet