iDreamPost

నెల్లూరు రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం.. పరుగులు తీసిన జనం!

  • Published Sep 05, 2023 | 11:35 AMUpdated Sep 05, 2023 | 11:35 AM
  • Published Sep 05, 2023 | 11:35 AMUpdated Sep 05, 2023 | 11:35 AM
నెల్లూరు రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం.. పరుగులు తీసిన జనం!

రవాణా వ్యవస్థకు సంబంధించిన రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, విమానాశ్రయాలను టార్గెట్ చేసుకొని కొంతమంది బాంబు బెదిరింపు కాల్స్ కి పాల్పపడుతున్న సంఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. కొన్నిసార్లు బాంబులు పెట్టి విధ్వంసాలకు పాల్పపడిన ఘటనలు ఎన్నో జరిగాయి. బాంబు బెదిరింపు కాల్స్ రాగానే పోలీసులతో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ స్పాట్ లో క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. బాంబు కి సంబంధించిన ఆనవాళ్లు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. కొన్నిసార్లు బాంబులు కనిపెడితే వాటిని నిర్వీర్యం చేస్తుంటారు. ఇటీవల కొంతమంది ఆకతాయిలు బాంబు బెదిరింపు కాల్స్ చేస్తూ అటు ప్రజలను, అధికారులను కంగారు పెట్టిస్తున్నారు. తాజాగా ఏపీలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ లో వరుస బాంబు బెదిరింపు కాల్స్ తీవ్ర కలకలం రేపాయి. గన్నవరం విమానాశ్రయంతో పాటు నెల్లూరు రైల్వే స్టేషన్ లో బాంబులు పెట్టినట్లు బెదిరింపు కాల్స్ రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు. పోలీస్ అధికారులు వెంటనే అప్రమత్తమై బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కి సమాచారం అందించి ప్రయాణికులను జాగ్రత్తగా బయటకు పంపించి వేశారు అధికారులు. విమానాశ్రయం, రైల్వేస్టేషన్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. కానీ ఎక్కడ కూడా బాంబు ఆనవాలు లభ్యం కాలేదు.. ఎవరో ఆకతాయిలు కావాలని బెదిరింపు కాల్స్ కి పాల్పపడ్డారని నిర్ధారణకు వచ్చారు. మొత్తానికి ఎలాంటి ప్రమాదం లేదని తేలిన తర్వాత ప్రయాణికులు, పోలీసులు, అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

గన్నవరం విమానాశ్రయంలో గత రాత్రి ఢిల్లీకి బయలుదేరేందుకు ఎయిర్ ఇండియా విమానం సిద్దంగా ఉంది. అంతలోనే ఓ అగంతకుడు విమానాశ్రయంలో బాంబు ఉంది.. కొద్ది సేపట్లో పేలిపోతుందని అధికారులకు ఫోన్ చేయడంతో.. వెంటనే అలర్ట్ అయి ప్రయాణికులను విమానాశ్రయంలోకి అనుమతి నిలిపివేశారు. అప్పటికే లోపలికి వచ్చినవారిని బయటకు పంపి తనిఖీలు చేపట్టారు. ఢిల్లీకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్న విమానాన్ని కూడా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు నెల్లూరు రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టినట్టుగా.. అది కొద్ది క్షణాల్లో పేలిపోతుందని ఓ అగంతకుడు 112 నంబర్ ఫోన్ చేశాడు. వెంటనే రైల్వే స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేసారు. బాంబు తనిఖీ చేయగా ఎక్కడ లభించలేదు. కాగా, రెండు చోట్ల బాంబు బెదిరింపు కాల్స్ కి పాల్పపడిన అగంతకుల గురించి సీరియస్ గా తీసుకొని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి