iDreamPost
android-app
ios-app

నలుగురి ప్రాణాలు బలి తీసుకున్న మస్కిటో రిపల్లెంట్‌!

నలుగురి ప్రాణాలు బలి తీసుకున్న మస్కిటో రిపల్లెంట్‌!

వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమల బెడద పెరిగిపోతుంది. రాత్రి అయితే.. దోమలు చుట్టాల్లాగా ఇల్లంతా కలియతిరుగుతూ కుట్టి, కుట్టి రక్తం పీల్చేస్తుంటాయి. దోమలు ఎక్కువగా ఉంటే ఫ్యాను ఉన్నా కూడా రాత్రి నిద్రపోవటం కష్టం అవుతుంది. అందుకే చాలా మంది మస్కిటో కాయిల్స్‌, అగరబత్తీలు, మస్కిటో రిపల్లెంట్లు వాడుతూ ఉంటారు. కొన్ని సార్లు ఇవే ప్రమాదాలు కొని తెస్తూ ఉంటాయి. మస్కిటో కాయిల్స్‌, రిపల్లెంట్ల కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు.

తాజాగా, మస్కిటో రిపల్లెంట్‌ పేలి, నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని మధుర్‌-ఎమ్‌ఎమ్‌డీఏకు చెందిన 65 ఏళ్ల సంతాన లక్ష్మి ఫ్యామిలీ శుక్రవారం రాత్రి మస్కిటో రిపల్లెంట్‌ పెట్టుకుని నిద్రపోయింది. రాత్రి వాళ్లు గాఢ నిద్రలో ఉండగా.. మస్కిటో రిపల్లెంట్‌ పేలింది. పేలిన తర్వాత అది కింద ఉన్న నైలాన్‌ క్లాత్‌పై పడింది. రిపల్లెంట్‌ కారణంగా నైలాన్‌ క్లాత్‌ కొద్దిగా అంటుకుంది. ఆ తర్వాత రిపల్లెంట్‌ లిక్విడ్‌ క్లాత్‌పై పడటం వల్ల భారీ పొగ వచ్చింది. గాఢ నిద్రలో ఉన్న కుటుంబసభ్యులకు ఈ విషయాలు తెలియలేదు. లిక్విడ్‌ విష వాయువులను పీల్చారు.

దీంతో నిద్రలో ఉండగానే ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు వ్యక్తులు చనిపోయారు. సంతాన లక్ష్మితో పాటు 10 ఏళ్ల సంధ్య, 8 ఏళ్ల ప్రియ రక్షిత, 8 ఏళ్ల పవిత్ర ప్రాణాలు విడిచారు. శనివారం ఉదయం ఆ ఇంట్లోనుంచి పొగలు రావటం పొరిగిళ్ల వారు గుర్తించారు. వెంటనే డోరు ఓపెన్‌ చేసి చూడగా.. నలుగురు విగత జీవులుగా పడి ఉన్నారు. ఆ వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మస్కిటో రిపల్లెంట్‌ కారణంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవటంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.