మంచానికి పరిమితమైన భర్త, పిల్లలను వదిలి పెట్టి..!

ఈమెకు ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఆరు నెలల కిందట భర్త రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో భర్త మంచానికి పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే సంధ్య ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈమెకు ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఆరు నెలల కిందట భర్త రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో భర్త మంచానికి పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే సంధ్య ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది.

సంసారం అన్నాక ఎన్నో ఇబ్బందులు, మరెన్నో కష్టాలు దరి చేరుతు ఉంటాయి. అవన్నీ ఎదుర్కొని ముందుకు సాగితేనే భవిష్యత్ లో సంతోషంగా ఉండవచ్చని పెద్దలు చెబుతుంటారు. కానీ, కొందరు మాత్రం సమస్యల సుడిగుండం నుంచి బయటపడలేక ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంటుంటారు. వీటిని భరించడం మా వల్ల కాదని చివరికి ఆత్మహత్యలు చేసుకోవడం, లేదంటే కుటుంబ సభ్యులతో కలిసి బలవన్మరణానికి పాల్పడడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు గతంలోనే చాలానే చోటు చేసుకున్నాయి. అయితే అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మహిళ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనతో ఆమె భర్త. ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ గురవుతున్నారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలం బ్రహ్మణపల్లిలో శివసాయి-సంధ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 6 ఏళ్ల కిందట వివాహం జరిగింది. కొంత కాలానికి వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. భర్త స్థానికంగా పని చేస్తుండగా, భార్య కూలీ పనులకు వెళ్తుండేది. అలా వీరి సంసారం చాలా కాలం పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతూ ఉంది. ఈ క్రమంలోనే భర్త శివసాయి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడడంతో కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికొచ్చాడు. కానీ, శివసాయి కోలువడానికి చాలా టైమ్ పడుతుందని వైద్యులు తెలిపారు. కాగా, అతడు మంచానికే పరిమితమై ఇంట్లోనే ఉన్నాడు. దీంతో చేతిలో చిల్లగవ్వ లేకపోవడంతో సంసారం గడవడమే కష్టంగా మారింది. దీనికి తోడు ఇటీవల సంధ్య ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణించింది.

అటు భర్త మంచానికి పరిమితమవడం, ఇటు ఆర్థిక సమస్యలతో పాటు అనారోగ్యం దరిచేరడంతో సంధ్యకు ఏం చేయాలో అర్థం కాక తీవ్ర మనస్థాపానికి లోనైంది. ఈ క్రమంలోనే సంధ్య ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఇందులో భాగంగానే సోమవారం ఇంట్లో ఉన్న పిల్లలను పక్కింట్లో వదిలి పెట్టి తిరిగి ఇంటికొచ్చింది. అనంతరం.. నా చావుకి ఎవరూ కారణం కాదు. ఆర్థిక, అనారోగ్య సమస్యల కారణంగానే నేను చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంధ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్య చేసిన పనికి భర్త, ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Show comments