P Venkatesh
భర్త, పిల్లలు ఉండగానే వివాహిత గడపదాటిపోయింది. ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటా అంటే నమ్మి ప్రియుడితో వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంది. అసలు ఏం జరిగిందంటే?
భర్త, పిల్లలు ఉండగానే వివాహిత గడపదాటిపోయింది. ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటా అంటే నమ్మి ప్రియుడితో వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంది. అసలు ఏం జరిగిందంటే?
P Venkatesh
పచ్చని కాపురంలో చిచ్చుపెట్టుకుంది ఓ వివాహిత. భర్త, పిల్లలు ఉన్నారన్న విషయం మరిచి టప్పడగులు వేసింది. కుటుంబం పరువు పోతుందని ఆలోచించకుండా పిచ్చిగా ప్రవర్తించింది. పరాయి వ్యక్తి మోజులో పడి బంగారం లాంటి జీవితాన్ని పాడు చేసుకుంది. కొందరు మహిళలు భర్తలను వదిలేసి ప్రియుడితో కలిసి పారిపోతున్నారు. పిల్లలున్నారన్న సంగతి మరిచి ప్రియుడి చెంతకు చేరుతున్నారు. సినిమాల ప్రభావమో ఏమో కానీ అక్రమ సంబంధాలతో కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తున్నారు. గుడ్డిగా నమ్మి ప్రియుడితో వెళ్లి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఇదే రీతిలో ఓ వివాహిత ప్రియుడిని నమ్మి అతడితో ఎస్కేప్ అయ్యింది. భర్తను కాదని ప్రియుడితో వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంది.
ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చింతపల్లి మండలం ధైర్యపురితండాకు చెందిన వాంకుడోత్ హరినాయక్, రోజా(25) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు తండాలో కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కాపురం పిల్లాపాపలతో సజావుగా సాగుతోంది. ఈ క్రమంలో మూడో వ్యక్తి వీరి కాపురంలో చిచ్చుపెట్టాడు. అదే తండాకు చెందిన వాంకుడోత్ కళ్యాణ్ కొన్నిరోజుల నుంచి రోజాను ప్రేమిస్తున్నానని వెంట పడుతున్నాడు. రోజాకు మాయమాటలు చెప్పి తన వైపు తిప్పుకున్నాడు. ఆమెకు సెల్‌ఫోన్ కొనిచ్చి పెళ్లి చేసుకుంటానని కళ్యాణ్ చెప్పాడు. అతడి మాటలు నమ్మిన రోజా గత నెల 26వ తేదీన అతడితో కలిసి కారులో వరంగల్ పారిపోయారు.
ఆ తర్వాత రోజా కుటుంబ సభ్యులు, భర్త వాంకుడోత్ హరినాయక్ రోజాను తీసుకెళ్లిన కళ్యాణ్ కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు. ఈ విషయం తెలిసి మరుసటిరోజు రోజాను కళ్యాణ్ గ్రామానికి తిరిగి తీసుకొచ్చాడు. ఆ తర్వాత పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా రోజా తన భర్త వెంట కాపురానికి వెళ్లింది. అప్పటి నుంచి కళ్యాణ్ తల్లిదండ్రులు వాంకుడోత్ వెంకటి, శారద సూటిపూటి మాటలతో రోజాను వేధించసాగారు. దీంతో రోజా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇక తను బ్రతకడం వేస్ట్ అని భావించి ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఇది గమనించిన స్థానికులు రోజాను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
రోజా ఆరోగ్యం విషమించడంతో అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ప్రేమ పేరుతో మోసపోయి తనువు చాలించింది. మృతురాలి భర్త వాంకుడోత్ హరి నాయక్ ఫిర్యాదు మేరకు వాంకుడోత్ కళ్యాణ్, అతడి తల్లిదండ్రులు వెంకటి, శారద పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. భర్తను కాదని ప్రియుడితో వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.