iDreamPost
android-app
ios-app

బాంబు పేలుడు.. మాజీ MLA భార్య మృతి!

  • Published Aug 11, 2024 | 5:12 PM Updated Updated Aug 11, 2024 | 5:12 PM

Manipur Bomb Blast: దేశ వ్యాప్తంగా గత కొంత కాలంగా ఉగ్రవాదులు పలు ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్ట్ చేస్తూ భయాందోళన సృష్టిస్తున్నారు. వీరి ఉన్మాద చర్యకు ఎంతోమంది అమాకులు బలవుతున్నారు.

Manipur Bomb Blast: దేశ వ్యాప్తంగా గత కొంత కాలంగా ఉగ్రవాదులు పలు ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్ట్ చేస్తూ భయాందోళన సృష్టిస్తున్నారు. వీరి ఉన్మాద చర్యకు ఎంతోమంది అమాకులు బలవుతున్నారు.

బాంబు పేలుడు.. మాజీ MLA భార్య మృతి!

ఇటీవల దేశంలో పలు చోట్ల కొంతమంది దుండగులు బాంబు దాడులు చేస్తూ అలజడి సృష్టిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఉగ్రమూకలు మన దేశంలో బాంబుదాడులకు తెగబడతూ ఎంతోమంది అమాయకుల ప్రాణాలు బలికొంటున్నారు.ఆ మధ్య బెంగుళూరులోని ఫేమస్ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్ లో భారీ బాంబ్ పేలుడు సంభవించింది. ఈ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనలో పదిమంది గాయపడ్డారు. ఎన్ఐఏ నింధితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత కొన్నిరోజులుగా ఈశాన్య రాష్ట్రంలో చెలరేగుతున్న గొడవలు దేశంలో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా బాంబ్ బ్లాస్ లో మాజీ ఎమ్మెల్యే భార్య కన్నుమూయడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల ఈశాన్య రాష్ట్రంలో మణిపూర్ లో ఎన్నో దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే మణిపూర్ లో బాంబు పేలుడు ఘటనలో మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు. మరోవైను తెంగ్నౌపాల్ జిల్లాలో ఉగ్రవాదులు, గ్రామ వాలంటీర్ల మద్య జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు కన్నుమూశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణిపూర్ లోని కాంగ్‌పోక్పీ జిల్లాల్లో బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి సైకుల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యమ్‌థాంగ్ హౌకిప్‌ ఇంటి సమీపంలో దుండగులు అమర్చిన బాంబు పేలిపోయింది. ఈ పేలుడు ఘటనలో హౌకిప్‌ రెండో భార్య సపం చారుబాలా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కన్నుమూశారు.

యమ్‌థాంగ్ హౌకిప్, సైకుల్ స్థానం నుండి 2012, 2017లో కాంగ్రెస్ టిక్కెట్‌పై రెండుసార్లు గెలిచారు. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తీర్థం పుచ్చుకున్నారు. పేలుడు సమయంలో మాజీ ఎమ్మెల్యే, వారి కుమార్తె ఇంట్లోనే ఉన్నప్పటికీ వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయంపై సైకుల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బాంబు పేలుడు ఘటన స్థానికంగా సంచలనం రేపింది.