iDreamPost
android-app
ios-app

విషాదం: ఊయల మెడకు బిగుసుని బాలుడు మృతి!

  • Published Jul 18, 2023 | 9:37 PM Updated Updated Jul 18, 2023 | 9:37 PM
  • Published Jul 18, 2023 | 9:37 PMUpdated Jul 18, 2023 | 9:37 PM
విషాదం: ఊయల మెడకు బిగుసుని బాలుడు మృతి!

ఊయలే ఉరి తాడైతే.. వినటానికి భయంకరంగా ఉన్న మంచిర్యాల జిల్లాలో ఇదే జరిగింది. అక్షిత్ అనే బాలుడు ఆడుకుంటుండగా ఏకంగా ఊయల అతని మెడకు బిగుసుకుపోయింది. దీంతో ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే అదే ప్రాణం దక్కకుండా పోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలే ఏడ్చారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనతో గ్రామస్తులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక నిన్నటి వరకు ఆడుతు పాడుతూ తిరిగిన అక్షిత్.. లేడు, ఇక రాడని తెలియడంతో అతని స్నేహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా భీమిని మండలం బిట్టుర్పల్లి పరిధిలోని రాజారంలో గ్రామంలో గణపతి-సునీత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి అక్షిత్ (13) అనే కుమారుడు ఉన్నాడు. అయితే, సోమవారం స్కూల్ కు సెలవు కావడంతో అక్షిత్ ఇంటి వద్దే తన స్నేహితులతో కలిసి ఆడుకున్నాడు. ఇక మధ్యాహ్నం సమయంలో ఈ బాలుడు.. తన ఇంట్లో చీరతో చేసిన ఊయలతో ఆడుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆ ఊయల అక్షిత్ మెడకు బిగుసుకుపోయింది. దీంతో అతడు అప్రమత్తమై మెడ నుంచి తీసుకునే ప్రయత్నం చేయగా అది మరింత బిగిసుకుపోయింది.

ఇక స్థానికులు వెంటనే స్పందించి అక్షిత్ ను కిందకు దించారు. అతడు అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఇంటికి చేరుకున్న అతని అక్షిత్ ను ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలోనే ఆ బాలుడు మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇక కుమారుడి మరణ వార్తతో అతని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతర ఈ ఘటనసపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

ఇది కూడా చదవండి: ప్రేమించాడని ప్రియుడిని నడిరోడ్డుపై చంపిన ప్రియురాలి కుటుంబ సభ్యులు!

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş