iDreamPost
android-app
ios-app

ఆర్టీసీ బస్సులో వింత దొంగతనం.. దాన్ని నువ్వేం చేసుకుంటావ్‌ బాబు!

ఆర్టీసీ బస్సులో వింత దొంగతనం.. దాన్ని నువ్వేం చేసుకుంటావ్‌ బాబు!

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో ఓ వింత దొంగతనం జరిగింది. ఓ వ్యక్తి టిక్కెట్లు ఇచ్చే మిషిన్‌ను దొంగతనం చేశాడు. తర్వాత తాను దొంగతనం చేసిన టిక్కెట్‌ మిషన్‌ తనకు ఎందుకూ పనికి రాదని భావించి దాన్ని ఓ చోట వదిలేసి వెళ్లిపోయాడు. ఆ మిషిన్‌ పోలీసుల పుణ్యమా అని తిరిగి కండెక్టర్‌ను చేరింది. ఆ వివరాల్లోకి వెళితే.. మార్కాపురం డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు ఒంగోలు నుంచి మార్కాపురం వచ్చింది. మధ్యాహ్నం కావటంతో డ్రైవర్‌ భోజనం చేయటానికి బస్సును డిపోలో ఆపాడు. కండెక్టర్‌ కూడా భోజనం చేయటానికి సిద్దమై..

టిక్కెట్లు ఇచ్చే టిమ్‌ మిషన్‌ ఉన్న బ్యాగును అక్కడే బస్సులో వదిలేశాడు. భోజనం ముగించుకుని మళ్లీ బస్సు దగ్గరకు వచ్చారు. మిషిన్‌ కోసం చూసే సరికి అది కనిపించలేదు. బస్సు మొత్తం వెతికినా కనిపించకపోయే సరికి దాన్ని ఎవరైనా దొంగిలించి ఉంటారని భావించాడు. ఈ విషయాన్ని వెంటనే డిపో మేనేజర్‌కు చెప్పాడు. డిపో మేనేజర్‌ పోలీస్‌ కంప్లైంట్‌ ఇవ్వమని చెప్పాడు. డిపో మేనేజర్‌ సలహా మేరకు డ్రైవర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మార్కాపురం చర్చి దగ్గర బ్యాగును గుర్తించారు. బ్యాగులో మిషిన్‌ ఉండటంతో దాన్ని డ్రైవర్‌కు అప్పజెప్పారు. ఆ మిషిన్‌ను దొంగిలించాల్సిన అవసరం ఎవరికుంది? ఎవరు దాన్ని దొంగిలించారు? అన్న దానిపై విచారణ చేస్తున్నారు. ఇక, దొంగిలించబడిన టిమ్‌ మిషన్‌ దొరకటంతో డ్రైవర్‌, కండెక్టర్‌ ఊపిరి పీల్చుకున్నారు. కంప్లైంట్‌ ఇచ్చిన వెంటనే స్పందించి.. మిషిన్‌ను తిరిగి తెచ్చిచ్చిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. మరి, ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో చోటుచేసుకున్న ఈ వింత దొంగతనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.