iDreamPost
android-app
ios-app

ఇంత దారుణమా.. తమ్ముడి భార్యపై అన్న దాష్టీక చర్య

  • Published Dec 25, 2023 | 9:33 AM Updated Updated Dec 25, 2023 | 9:33 AM

నాగరిక సమాజంలో బతుకుతున్నామని చెప్పుకుంటున్నాము.. కానీ సమాజంలో చోటు చేసుకుంటున్న కొన్ని దారుణాలు చూస్తే.. మన కన్నా జంతువులు చాలా నయం కదా అనిపిస్తుంది. సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునే అమానవీయ సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

నాగరిక సమాజంలో బతుకుతున్నామని చెప్పుకుంటున్నాము.. కానీ సమాజంలో చోటు చేసుకుంటున్న కొన్ని దారుణాలు చూస్తే.. మన కన్నా జంతువులు చాలా నయం కదా అనిపిస్తుంది. సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునే అమానవీయ సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

  • Published Dec 25, 2023 | 9:33 AMUpdated Dec 25, 2023 | 9:33 AM
ఇంత దారుణమా.. తమ్ముడి భార్యపై అన్న దాష్టీక చర్య

కొన్ని వందల ఏళ్ల క్రితం మన సమాజంలో సతీ సహగమనం అనే అనాగరిక దురాచారం అమల్లో ఉండేది. భర్త చనిపోతే.. భార్య కూడా అతడి చితి మంటల మీద పడి తనువు చాలించాల్సిందే అనే నియమం అమల్లో ఉండేది. అసలే నాటి కాలంలో బాల్య వివాహాలు. పట్టుమని పదేళ్లు కూడా లేని ఆడ పిల్లలకు.. ఆరేడు రెట్లు ఎక్కువ వయసున్న పురుషులతో వివాహం చేసేవారు. వయసుడిగి భర్త మరణిస్తే.. తప్పకుండా ఆ చిన్నారి వధువును కూడా సతీ సమగమనం చేయించేవారు. కాలం గడుస్తున్న కొద్ది ఈ దురాచారం సమాజం నుంచి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అయితే నేటి రాకెట్ యుగంలో కూడా కొన్ని చోట్ల ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. తమ్ముడి భార్యను సజీవ దహనం చేశాడు ఓ వ్యక్తి. ఆ వివరాలు..

మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో శనివారం పట్టపగలు ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహించిన అన్న దారుణానికి పాల్పడ్డాడు. సోదరుడి మరణాన్ని జీర్ణించుకోలేని ఆ వ్యక్తి.. తమ తమ్ముడి భార్యను సజీవ దహనం చేశాడు.. అది కూడా ఆమె ఇద్దరి బిడ్డలు చూస్తుండగానే.. వారి కళ్లెదుటే ఈ దారుణానికి పాల్పడ్డాడు.

It's atrocious on his brother's wife

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా ధోధర్‌ గ్రామానికి చెందిన ప్రకాశ్‌ అనే వ్యక్తి వ్యక్తిగత కారణాలతో ఆర్నెల్ల కిందట ఆత్మహత్య చేసుకుని మరణించాడు. దీంతో అతడి భార్య నిర్మల (33) తన ఇద్దరు పిల్లలతో కలిసి అత్తింటి వద్దే అనగానే ధోధర్ గ్రామంలోనే నివసిస్తోంది. అయితే తన తమ్ముడు ప్రకాశ్ ఆత్మహత్యకు.. అతడి భార్య నిర్మలే కారణమంటూ.. మృతుడి అన్న సురేశ్‌ (40) బలంగా నమ్మాడు. దాంతో తమ్ముడి భార్య అనగా మరదలు నిర్మలను వేధించసాగాడు.

ఈ క్రమంలో శనివారం నాడు అతడు దారుణానికి పాల్పడ్డాడు. తన మరదలు నిర్మలపై రాడ్డుతో దాడి చేశాడు సురేష్. అంతటితో ఆగక.. ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆమె కన్నబిడ్డల కళ్లెదుటే నిర్మలను సజీవ దహనం చేశాడు సురేష్. ఆ తర్వాత మరదలి సోదరులకు ఫోన్ చేసి.. తాను నిర్మలను సీజవం దహనం చేశానని చెప్పాడు. దాంతో నిర్మల పుట్టింటి వారు జరిగిన దారుణం గురించి మీడియా, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ప్రకాశ్ ఆత్మహత్య చేసుకోవడానికి.. తన సోదరి నిర్మలనే కారణమని, ఆమెను చంపేస్తానని సురేశ్‌ గతంలోనూ పలుమార్లు బెదిరించినట్లు వారు ఆరోపించారు. దాంతో తాము భయపడి.. ఆమెను పుట్టింటికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఇంతలో ఈ ఘోరం జరిగినట్లు వారు మీడియా ఎదుట కన్నీటి పర్యాంతమయ్యారు. నిర్మల సోదరుడు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నిందితుడి సురేష్ ని అరెస్టు చేసి, జైలుకు తరలించారు.

విచారణలో సురేష్ తన నేరాన్ని అంగీకరించాడని, హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) రాహుల్ కుమార్ లోధా తెలిపారు. నిర్మల హత్య వెనుక గల అసలు కారణాలు, ప్రకాష్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందితుడిని కఠిన శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.